నందమూరి వారిది భోజన ప్రియుల కుటుంబం

నందమూరి వారిది భోజన ప్రియుల కుటుంబం

'ఇజం' సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ లుక్‌ చూసి జనాలకు దిమ్మదిరిగింది. ఇప్పటిదాకా కళ్యాణ్‌ రామ్‌ను ఒకరకమైన లుక్‌లో చూస్తూ వచ్చిన జనాలకు.. ఈ కొత్త అవతారం షాకింగ్‌గా అనిపించింది. కళ్యాణ్‌ రామేంటి ఇలా తయారయ్యాడేంటి అనుకున్నారు. దాదాపుగా అందరూ ఈ లుక్‌ విషయంలో పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాకే ఇచ్చారు. ఐతే తనలో వచ్చిన ఈ మార్పుకు కారణం పూరినే అని.. క్రెడిట్‌ అంతా ఆయనకే ఇవ్వాలని అంటున్నాడు కళ్యాణ్‌. తాను ఎక్కువ బరువు ఉండటం వల్ల ఇంతకుముందు కొన్నిరకాల బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది ఉండేదని.. ఇప్పుడా ఇబ్బంది తప్పిందని అతనంటున్నాడు. తన కొత్త లుక్‌ గురించి కళ్యాణ్‌ రామ్‌ ఇంకా ఏమంటున్నాడంటే..


''నేను ఇంతకుముందు 86 కిలోలుండేవాడిని. 'ఇజం' సినిమా కోసం 11 కిలోలు తగ్గాను. ఈ సినిమా మొదలయ్యే ముందు పూరి నాకు రెండు విషయాలు చెప్పారు. నేను బరువు తగ్గాలన్నారు. అలాగే లుక్‌ పూర్తిగా మార్చేయాలన్నారు. కొత్త లుక్‌తో జనాలకు షాకిద్దాం అని చెప్పారు. ఆయన్ని నమ్మి
ముందుకెళ్లిపోయాను. మాది భోజన ప్రియుల కుటుంబం. నేను బాగా తింటాను. ఐతే 'ఇజం' కోసం నాలుగు నెలల పాటు స్ట్రిక్ట్‌ డైట్‌ ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఇది అంత సులువైన విషయం కాదు. నా థైస్‌ కొంచెం లావుగా ఉంటాయి. అందువల్ల స్కిన్‌ టైట్‌ ఉన్న ప్యాంట్లు వేయడం ఇబ్బందే. ఇంకా కొన్ని రకాల బట్టలు వేయలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏదైనా వేసుకోవచ్చు. 'ఇజం'లో నా లుక్‌ చూసి నా కొడుకు శౌర్య కూడా షాకయ్యాడు. ఈ మధ్య వాడు నా తొలి సినిమా 'తొలి చూపులోనే..' చూస్తూ ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం నేను వాడికి అంత సన్నగా కనిపిస్తున్నాను. సినిమాలో నేను సిక్స్‌ ప్యాక్‌ యాబ్స్‌ తో కనిపిస్తాను'' అని కళ్యాణ్‌ రామ్‌ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు