దుబాయిలో కబాలి ప్రతాపం చూడండి...

దుబాయిలో కబాలి ప్రతాపం చూడండి...

సౌత్ ఇండియాలో అతి పెద్ద మల్టీప్లెక్సుల్లో హైదరాబాద్‌లోని ‘ప్రసాద్ ఐమాక్స్’ ఒకటి. భారీ సినిమాలేవైనా విడుదలైనపుడు ఆ బిల్డింగ్ మీద భారీ పోస్టర్లు డిస్‌ప్లే చేస్తుంటారు. అవి సిటీలో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ఐతే మన నగరంలో లోకల్ సినిమాల పోసర్లను ఇలా చూడ్డం కాదు కానీ.. ఓ ఫారిన్ కంట్రీలో సౌత్ ఇండియన్ సినిమా ఓ మల్టీప్లెక్స్ మొత్తాన్ని కమ్మేస్తే ఎలా ఉంటుంది..? పైన కనిపిస్తున్న చిత్రమదే. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కబాలి’ దుబాయ్‌లోని ఓ పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ ముఖచిత్రంగా మారిపోయి అక్కడి జనాల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది.

శుక్రవారం ‘కబాలి’ విడుదల నేపథ్యంలో ముందు రోజే దుబాయ్‌లో భారీగా ప్రిమియర్లు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఓ మల్టీప్లెక్స్ ‘కబాలి’ ప్రిమియర్ షో గురించి ప్రకటిస్తూ భారీ ఫ్లెక్సీని డిస్‌ప్లే చేసింది. దుబాయ్‌లో ఓ ఇండియన్ సినిమాకు ఈ స్థాయిలో ప్రయారిటీ ఇవ్వడం ఇంతకుముందెన్నడూ జరగలేదు. రజినీ మేనియా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ‘కబాలి’ విడుదలవడం విశేషం. చాలా చోట్ల లోకల్ సినిమా స్థాయిలో హైప్ కనిపిస్తోంది. ముఖ్యంగా దుబాయ్, చైనా, సింగపూర్, మలేషియా, జపాన్ లాంటి ఇండియాకు దగ్గరగా ఉండే.. రజినీకాంత్‌కు మంచి ఫాలోయింగ్ ఉన్న దేశాల్లో సందడి మామూలుగా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు