‘లింగా’తో మాయమై.. ఇప్పుడొచ్చాడు

‘లింగా’తో మాయమై.. ఇప్పుడొచ్చాడు

కె.ఎస్.రవికుమార్.. సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడు. రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి లాంటి సూపర్ స్టార్లతో సినిమా చేస్తూ దాదాపు రెండు దశాబ్దాల పాటు సౌత్ ఇండియన్ సినిమాలో తన ఆధిపత్యాన్ని చాటుకున్న కె.ఎస్. ఏడాదిన్నర కిందట తన కెరీర్లోనే అతి పెద్ద ఫెయల్యూర్ ఎదుర్కొన్నాడు. రజినీకాంత్ హీరోగా ‘లింగా’ లాంటి డిజాస్టర్ తీశాడు.

సూపర్ స్టార్ లాంటి హీరోను పెట్టుకుని అలాంటి సినిమా తీశాడేంటని కె.ఎస్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా ఆయన ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసింది. ‘లింగా’ చేస్తున్న టైంలో అయితే.. రజినీతో ఇంకో సినిమా చేసే ఆలోచనతో ఉన్నాడు కె.ఎస్. రజినీ కూడా అందుకు సుముఖంగానే ఉన్నాడు. కానీ ‘లింగా’ రిలీజయ్యా పరిస్థితి మారిపోయింది. రజినీ దండం పెట్టేయడంతో వేరే హీరోను చూసుకోవాల్సి వచ్చింది. ఐతే కె.ఎస్‌కు మళ్లీ ఓ స్టార్ హీరోనే తగిలాడు.

కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా ‘ముడింజా ఇవనా పుడి’ (నీ వల్లయితే వీణ్ని పట్టుకో) అనే సినిమా చేశాడు కె.ఎస్. ఇందులో నిత్యామీనన్ కథానాయికగా నటించడం విశేషం. కె.ఎస్. స్టయిల్లోనే ఇదో యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. తమిళం, కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని ముందు ఆ రెండు భాషల్లో రిలీజ్ చేసి.. ఆ తర్వాత తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు