సమంతను రూమ్‌కి తీసుకెళ్తారా?

సమంతను రూమ్‌కి తీసుకెళ్తారా?

మామూలుగానే హీరోయిన్లంటే బయట జనాలకు కాస్త చిన్నచూపు ఉంటుంది. సదరు హీరోయిన్లందరూ డబ్బులు కోసం రూములకు వచ్చేస్తారని చాలామంది నమ్మేసి, దానికి ప్రచారాన్ని కూడా కల్పిస్తారు. వాస్తవానికి ఇక్కడ సీన్‌ వేరు, బయట జనాలు చెప్పుకొనేది వేరు. అయితే జనాల్లో ఉన్న ఈ నమ్మకాన్ని క్యాష్‌ చేసుకుందామని చూస్తున్నారు యాక్షన్‌ 3డి చిత్ర నిర్మాత-దర్శకుడు.

సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందేమంటే, ఈ చిత్రంలోని నలుగు హీరోలు ఒకమ్మాయిని రూమ్‌కి తెచ్చుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారో మీకు తెలిసిందే. అలా వచ్చిన అమ్మాయి పేరు సమంత. ఇక ఆడియన్స్‌ను నవ్వించడానికి సమంత పేరు అడ్డుపెట్టుకొని మనోళ్ళు వీలైనన్ని డబుల్‌ మీనింగ్‌ జోకులు వేసేశారట. అసలు ఒక స్టార్‌ హీరోయిన్‌ మీద ఇలాంటి బూతు కామెడి అంటే వినడానికి కాస్త ఇబ్బందిగానే ఉంది.

ఇదే విషయం సమంత కాస్త సీరియస్‌గా తీసుకొని కోర్టులో ఒక కేసు వేస్తే, అప్పుడు తెలుస్తుంది అసలు సీన్‌ ఎలా ఉంటుందో. సర్లేండి, సినిమాలో ఆ సీన్‌ ఉందోలేదో తెలియదు కాబట్టి, దీని గురించి మనం రిలీజయ్యాక చర్చిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English