పాకం చెడిపోతుందేమో చిరూ..

పాకం చెడిపోతుందేమో చిరూ..

వంటవాళ్లు ఎక్కువైతే పాకం చెడిపోతుందన్న సామెత ఒకటుంది. సినిమాల విషయంలో అప్పుడప్పుడూ ఇలాగే జరుగుతుంటుంది. కొన్ని ప్రతిష్టాత్మకమైన సినిమాలకు ఒకరికి మించి రచయితలు పని చేస్తుంటారు. స్క్రిప్టును అదుÄతేంగా తీర్చిదిద్దే క్రమంలో చాలామంది రచయితల సహకారం తీసుకుంటూ ఉంటారు దర్శకులు. ఐతే ఇలా ఎక్కువ మంది హ్యాండ్స్‌ పడటం వల్ల కిచిడీగా మారిపోయి దెబ్బ తిన్న సినిమాలు లేకపోలేదు.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమా 'డిక్టేటర్‌'కు ఏకంగా నలుగురు రచయితలు పని చేశారు. తీరా సినిమా చూస్తే ఇంతమంది కలిసి ఇదా చేసింది అనిపించింది. అంతకుముందు మహేష్‌ బాబు మూవీ 'ఆగడు'కు ముగ్గరు రచయితలు పని చేశారు. వాళ్లకు శ్రీను వైట్ల కూడా సహకారం అందించాడు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ సినిమా 'గబ్బర్‌ సింగ్‌' స్క్రిప్టులో కూడా చేతులు పడ్డాయి. ఆ సినిమా రిజల్ట్‌ కూడా తేడా వచ్చేసింది. 'బ్రహ్మూెత్సవం' టైటిల్‌ కార్డ్స్‌ లో కూడా రచనా సహకారం అంటూ ఐదారుగురి పేర్లు వేశాడు శ్రీకాంత్‌ అడ్డాల.

ఇప్పుడీ సినిమాల ప్రస్తావన ఎందుకూ అంటే.. చిరంజీవి 150వ సినిమాకు కూడా చాలామంది రచయితలే పని చేశారు. బేసిగ్గా ఈ సినిమాకు సీనియర్‌ రైట్సర్‌ పరుచూరి బ్రదర్స్‌ రచన అందించారు. ఐతే తెరమీద వాళ్లిద్దరి పేర్లే పడేలా ఉన్నప్పటికీ ఇంకో ఇద్దరు ముగ్గురు ఘోస్ట్‌ రైటర్లు కూడా పని చేశారట. వీళ్లందరూ చాలదని.. తాజాగా సాయి మాధవ్‌ బుర్రా కూడా లైన్లోకి వచ్చాడు. స్క్రిప్టుకి ఆయన కూడా టచప్స్‌ ఇచ్చాడు. కొన్ని సీన్లు.. మాటలు రాశాడు. మరి ఇంతమంది చేతులు పడ్డ పాకం ఎలా తయారవుతుందో చూడాలి. కాకపోతే ఈ సినిమా రీమేక్‌ కావడం కొంత కలిసొచ్చే అంశం. ప్రూవ్డ్‌ స్టోరీ కాబట్టి మరీ ఎక్కువ మార్పులు చేయడానికి అవకాశం లేదు. ఇంతకీ ఫైనల్‌ గా ఔట్‌ పుట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు