ఎంపీల శాలరీలు పెరిగాయోచ్‌

ఎంపీల శాలరీలు పెరిగాయోచ్‌

మన ఎంపీల జీతాలు త్వరలోనే డబుల్‌ కానున్నాయి. ఇప్పటి వరకు వారు తీసుకుంటున్న జాతాలకు రెట్టింపు జీతాలను ఇకపై వారు అందుకోనున్నారు. ఎంపీల జీతాలు తక్కువగా ఉన్నాయని, వీటిని పెంచాలంటూ కొద్ది రోజుల క్రితం కేంద్ర కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా జీతాలను ఎలా పెంచాలి ? ఇతర దేశాల పార్లమెంటు సభ్యులతో పోలిస్తే మన పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు ఎలా ఉన్నాయి ? అనే అంశాల పరిశీలనకు ఎంపీలతు, మంత్రులతో కూడిన కమిటీని నియమించారు.

ఈ కమిటీ పలు అంశాలు పరిశీలించి, చివరకు పలు సిఫార్సులను కేబినెట్‌కు పంపింది. ఈ ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంగీకరించాల్సి ఉంది. ఈ సిఫార్సులు వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ప్రధానమంత్రి ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. వీటికి పార్లమెంటు ఆమోదం లభిస్తే మన ఎంపీలందరూ ఇకపై కొత్త జీతాలను అందుకోనున్నారు. ఎంపీలకు పెంచిన జీతాలు ఏప్రిల్‌ 1నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర వర్గాల ద్వారా సూచనాభిప్రాయంగా తెలుస్తోంది. 

ప్రస్తుతం మనకు పార్లమెంటులో లోక్‌సభలో 545 మంది, రాజ్యసభలో 250 మంది ఎంపీలు ఉన్నారు. కొత్త వేతనాల ప్రకారం ఎంపీ నెల జీతం రూ.1 లక్షకు చేరుతుంది. ఇక వీరికి నియోజకవర్గ అలవెన్సులు, ప్రయాణ అలవెన్సులు, ఇతర అలవెన్సులు కలిపి మరో రూ.90 వేలు అదనంగా లభిస్తాయి. ఇక ఎంపీలకు ప్రతియేటా ఇచ్చే వార్షిక ఫర్నీచర్‌ అలవెన్స్‌ కూడా రెట్టింపు కానుంది. ఎంపీలతో పాటు వారి సిబ్బంది జీతాలు కూడా డబుల్‌ అవుతున్నాయి. మాజీ ఎంపీల నెలవారి పింఛన్‌ రూ.20 వేల నుంచి రూ.35 వేలకు చేరనుంది. ఎంపీలకు ఈ న్యూ స్కేల్‌ అమలైతే వారి  మూల వేతనం రూ.50 నుంచి రూ.లక్షకు చేరుకోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు