విడుదలకు ముందే 223 కోట్లు

విడుదలకు ముందే 223 కోట్లు

రజినీకాంత్ నుంచి వరుసగా రెండు డిజాస్టర్లు వచ్చినా.. ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ‘కబాలి’కి అయిన బిజినెస్సే నిదర్శనం. టీజర్ రిలీజయ్యాక ‘కబాలి’ మీద ఒక్కసారిగా పెరిగిపోయిన అంచనాలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా మీద విపరీతమైన హైప్ నెలకొంది. ఆ హైప్‌కు తగ్గట్లే బిజినెస్ కూడా జరిగింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.223 కోట్లకు ప్రి రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. కొన్ని బాలీవుడ్ సినిమాల్ని మినహాయిస్తే సౌత్ ఇండియా వరకు అత్యధిక బిజినెస్ చేసిన సినిమా ‘కబాలి’నే. ఏరియాల వారీగా ‘కబాలి’ బిజినెస్ ఏ స్థాయిలో చేసిందో చూద్దాం.

తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని రూ.68 కోట్లకు జాజ్ సినిమాస్ అనే సంస్థ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల హక్కుల్ని షణ్ముగ ఫిలిమ్స్ రూ.32 కోట్లకు తీసుకుంది. కేరళ హక్కులు రూ.7.5 కోట్లకు.. కర్ణాటక హక్కులు రూ.10 కోట్లకు అమ్మారు. కర్ణాటకలో ‘లింగా’ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ ‘కబాలి’ రైట్స్ తీసుకోవడం విశేషం. నార్త్ ఇండియా మొత్తానికి కలిపి ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ రూ.15.5 కోట్లకు హోల్ సేల్‌గా రైట్స్ తీసుకుంది. మలేషియాలో అక్కడి స్థానిక భాష మలాయ్‌లోనే ‘కబాలి’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆ హక్కులు రూ.10 కోట్లకు అమ్మారు. అమెరికా-కెనడా రైట్స్ రూ.8.5 కోట్లకు.. మిగతా ఓవర్సీస్ హక్కులన్నీ కలిపి రూ.16.5 కోట్లకు ఇచ్చారు. శాటిలైట్-మ్యూజిక్ రైట్స్ అన్నీ కలిపి రూ.40 కోట్ల వరకు ముట్టాయి. బ్రాండ్ ప్రమోటింగ్.. ఇతర మార్గాల్లో రూ.15 కోట్ల దాకా నిర్మాత ఖాతాలో పడ్డాయి. మొత్తంగా ఈ సినిమా రూ.223 కోట్లు బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది రజినీ సినిమా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు