నరేష్‌ కు కథల ఎంపిక చేతకావట్లేదా....

నరేష్‌ కు కథల ఎంపిక చేతకావట్లేదా....

పాయే.. కొత్త సినిమా కూడా పాయే.. ఎన్నో ఆశలు పెట్టుకున్న సెల్ఫీరాజా సైతం పాయే..! ఇప్పుడు అల్లరి నరేష్‌ కెరీర్‌ ఎటువైపు వెళ్లనుంది. అసలు ఎలా అవుతాడనుకున్న హీరో.. ఎలా అవుతున్నాడు..?  రాజేంద్ర ప్రసాద్‌ తర్వాత ఆ స్థాయిలో మళ్లీ చక్రం తిప్పుతాడని కలలు కన్న హీరో  కెరీర్‌ కాస్తా ఇప్పుడు ఎటూ కాకుండా పోతోంది. ఒకట్రెండు సినిమాలు ఫ్లాపయ్యాయంటే ఏదో అనుకోవచ్చు గానీ వరసగా అరడజన్‌ కు పైగా సినిమాలు.. నాలుగేళ్లుగా పరాజయాలు వస్తున్నాయంటే పొరపాటు ఎక్కడుందనుకోవాలి..? నరేష్‌ కు కథల ఎంపిక చేతకావట్లేదా.. లేదంటే నిజంగానే ప్రేక్షకులు తననుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోతున్నాడా..?

నాలుగేళ్ల కింద వచ్చిన సుడిగాడుతో ఏకంగా 16 కోట్లు వసూలు చేస్తే నరేష్‌ స్టార్‌ హీరో అయిపోయాడనుకున్నారంతా. కానీ అదంతా అప్పటికి వచ్చే తుఫాన్‌ అని తెలియలేదు. ఆ తర్వాత వరసగా వచ్చిన అన్ని సినిమాలు టపా కట్టేసాయి. జేమ్స్‌ బాండ్‌, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి లాంటి సినిమాలు పరవాలేదన్నా... అవి నిలబడలేదంటే కచ్చితంగా నరేష్‌ పై నమ్మకం ప్రేక్షకుల్లో సన్నగిల్లినట్లే.

నరేష్‌ కెరీర్‌ ప్రస్తుతం ఎటూ కాకుండా ఉంది. సుడిగాడులో ఆల్రెడీ బోలెడన్ని స్పూఫ్‌ లు చేసాడు. కానీ ఇప్పుడు సెల్ఫీరాజాలోనూ మళ్లీ అదే స్పూఫ్‌ లు తిప్పితిప్పి చేస్తే జనం చూస్తారా..? ఈ చిన్న లాజిక్‌ నరేష్‌ ఎలా మిస్సయ్యాడు..? కథ లేకుండా నాలుగు స్పూఫ్‌ లు ఉంటే చాలనుకుని ఈ కథను నరేష్‌ ఓకే చేసాడా..?  సెల్ఫీరాజా విడుదలైన తర్వాత నరేష్‌ జడ్జిమెంట్‌ పైనే ప్రేక్షకుల్లో అనుమానాలు వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అల్లరోడి కెరీర్‌ ఏమవుతుందో అనే డిస్కషన్స్‌ జరుగుతున్నాయి.  ప్రస్తుతం బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం.. అనీల్‌ కృష్ణతో మేడ మీద అబ్బాయి సినిమాలు చేస్తున్నాడు నరేష్‌. ఈ రెండే అల్లరోడి కెరీర్‌ కు అండ. ఇవి పోతే కెరీర్‌ గుదిబండే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు