గ్యారేజ్ వాయిదా వెన‌క ఏం జ‌రిగింది..!

గ్యారేజ్ వాయిదా వెన‌క ఏం జ‌రిగింది..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న హై ఎక్స్‌పెక్టేష‌న్ మూవీ జ‌న‌తా గ్యారేజ్ రిలీజ్ డేట్ సాంకేతిక కారణాలతో కాస్త వెనక్కి వెళ్ళింది. ఆగస్ట్‌ 12న రిలీజ్ కావాల్సిన గ్యారేజ్ సెప్టెంబ‌ర్ 2కు వెళ్లిపోయింది. యావ‌త్ టాలీవుడ్ సినీ అభిమానులంద‌రూ గ్యారేజ్ ఆగ‌స్టు 12నే వ‌చ్చేస్తోంద‌ని ఫిక్స్ అయ్యి..ఆ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే వ‌ర్షాల కార‌ణంతో చివ‌రి షెడ్యూల్ కాస్త లేట్ అవ్వ‌డం, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొంచెం ఆల‌స్యమ‌వ‌డంతో గ్యారేజ్‌ను వాయిదా వేయ‌క త‌ప్ప‌లేద‌ని చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

 ఆగ‌స్టు 12న సినిమా రిలీజ్ చేస్తే ఆగ‌స్టు 15 హాలీడే కావ‌డంతో లాంగ్ వీకెండ్ సినిమాకు క‌లిసి వ‌స్తుంద‌ని చిత్ర యూనిట్ ముందుగా భావించింది.ఇక అదే టైంలో కృష్ణా పుష్క‌రాలు కూడా ఉండ‌డం సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌ను సెప్టెంబ‌ర్ 2కు మార్చారు. అప్పుడు కూడా వ‌రుస‌గా సెల‌వులు క‌లిసొస్తాయ‌న్న‌దే చిత్ర యూనిట్ ప్లాన్‌గా తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 2న సినిమాను రిలీజ్ చేసినా లాంగ్ వీకెండ్, హ‌రికృష్ణ పుట్టిన రోజు ఇలా అన్ని క‌లిసిరానున్నాయి.

 ఆగ‌స్టు 12న సంబ‌రాల‌కు రెడీ అయిపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ డేట్ వాయిదా కాస్త బాధాక‌ర‌మైన విష‌యమే. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో వంటి రెండు హిట్ సినిమాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో గ్యారేజ్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక గ్యారేజ్ ఫీవ‌ర్ ఎలా ఉందో ఈ సినిమా టీజ‌ర్‌కు యూ ట్యూబ్‌లో వ‌స్తోన్న రెస్పాన్సే చెపుతోంది. డైరెక్టర్ కొర‌టాల శివ పరంగా చూసినా కూడా ఈ సినిమా ఎన్టీఆర్‌కి సక్సెస్‌ ఇవ్వడం పక్కా అంటూ ఫిల్మ్‌నగర్‌ వర్గాలు  చ‌ర్చించుకుంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు