అల్లరి నరేష్ డైరెక్షన్లో లవ్ స్టోరీ

అల్లరి నరేష్ డైరెక్షన్లో లవ్ స్టోరీ

డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పని చేసినంత మాత్రాన అందరూ దర్శకులైపోతారనేం లేదు. ఐతే అల్లరి నరేష్ మాత్రం తాను ఏ లక్ష్యంతో అయితే సినిమాల్లో అడుగుపెట్టాడో ఆ లక్ష్యం విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లున్నాడు. తన పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్‌ను హీరోగా చేయాలని.. చిన్న కొడుకు నరేష్‌ను తన లాగే దర్శకుణ్ని చేయాలని ఆశపడ్డారు ఈవీవీ సత్యనారాయణ. ఆ ఆలోచనకు తగ్గట్లే నరేష్‌ను డైరక్షన్ డిపార్ట్‌మెంట్లోనే చేర్చాడాయన. తండ్రి దగ్గరే కాక వేరే దర్శకుల దగ్గరా పని చేశాడు నరేష్. కానీ అనుకోకుండా రవిబాబు కళ్లల్లో పడి హీరో అయిపోయాడు. తొలి సినిమా హిట్టవడంతో హీరోగానే స్థిరపడిపోయాడు.

ఐతే తన తండ్రి కోరిక నెరవేర్చడం తన బాధ్యత అని.. తాను సీరియస్‌గా దర్శకత్వం మీద దృష్టిపెడతానని.. ఇంకో మూడేళ్లలో తన దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని అంటున్నాడు నరేష్. తన దర్శకత్వంలో రాబోయే తొలి సినిమా ప్రేమకథ అని కూడా అతను వెల్లడించాడు. ‘‘ప్రస్తుతం హీరోగా నాకున్న కమిట్మెంట్లన్నీ రెండేళ్లలో పూర్తి చేస్తా. ఆ తర్వాత ఇంకో ఏడాది విరామం తీసుకుని దర్శకుడిగా అరంగేట్రం చేస్తాను. నేను దర్శకుడు కావాలన్నది మా నాన్న కల. నా లుక్స్ అంత బాగోవని.. కాబట్టి నేను హీరోగా సక్సెస్ కానని ఆయన అనుకున్నారు. కానీ నేను  50 సినిమాలు పూర్తి చేయగలిగాను. ఇప్పుడిక ఆయన కల నెరవేర్చడం మీద దృష్టిపెడతా’’ అని నరేష్ చెప్పాడు. ఎలాగూ హీరోగా అల్లరోడి కెరీర్ డల్లుగా ఉంది కాబట్టి.. దర్శకుడిగా మారడానికి ఇదే సరైన తరుణమేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English