మహేషూ.. ఈసారి అలా చేయొద్దు ప్లీజ్‌

మహేషూ.. ఈసారి అలా చేయొద్దు ప్లీజ్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌ తరహాలో మహేష్‌ బాబు గొప్ప డ్యాన్సర్‌ కాకపోవచ్చు. కానీ అతను డ్యాన్సుల్లో వీకేమీ కాదు. బాలనటుడిగానే డ్యాన్సులు అదరగొట్టాడు. హీరోగా తొలి సినిమా 'రాజకుమారుడు'లోనే తన డ్యాన్సింగ్‌ టాలెంట్‌ చూపించాడు. కెరీర్‌ ఆరంభంలో మంచి డ్యాన్స్‌ నంబర్స్‌ చేశాడు. ఐతే తర్వాత తర్వాత నటన మీదే ఎక్కువ ఫోకస్‌ పెట్టి.. డ్యాన్సుల గురించి పట్టించుకోవడం మానేయడంతో మహేష్‌ డ్యాన్సింగ్‌ టాలెంట్‌ మరుగున పడిపోయింది. కానీ ఈ మధ్య 'బ్రహ్మోత్సవం' సినిమాలో బాలా త్రిపురమణి పాటలో ఒక స్టెప్‌ ఏదో కామెడీగా తయారవడంతో మహేష్‌ మరీ బ్యాడ్‌ డ్యాన్సర్‌ అన్నట్లు.. అతడికి డ్యాన్సులు చేతకావన్నట్లు యాంటీ ఫ్యాన్స్‌ రెచ్చిపోయి ప్రచారం చేశారు. సోషల్‌ మీడియాలో మరీ వేలాకోళాలాడేశారు.

ఈ నేపథ్యంలో మహేష్‌ ఫ్యాన్స్‌ చాలా కసి మీద ఉన్నారు. బాగా డ్యాన్స్‌ చేయగలిగి ఉండి కూడా.. మహేష్‌ దాని మీద ఫోకస్‌ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. తర్వాతి సినిమాలో యాంటీ ఫ్యాన్స్‌కు రిటార్ట్‌ ఇచ్చేలా మహేష్‌ తన డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ చూపించాలని వాళ్లు ఆశిస్తున్నారు. డ్యాన్స్‌ మాస్టర్లు.. డ్యాన్స్‌ మూమెంట్ల విషయంలోనూ కొంచెం కేర్‌ ఫుల్‌గా ఉండాలని వాళ్లు మహేష్‌కు సలహా ఇస్తున్నారు. ఇంతకుముందు '1 నేనొక్కడినే' విషయంలో సుకుమార్‌.. మహేష్‌తో పట్టుబట్టి డ్యాన్సుల మీద దృష్టిపెట్టేలా చేశాడు. అందులో కొన్ని స్టెప్పులకు మంచి రెస్పాన్సే వచ్చింది. మురుగదాస్‌ కూడా సుక్కులాగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన సినిమాల్లో కమర్షియల్‌ విలువలకు ఢోకా లేకుండా చూసుకుంటాడు మురుగదాస్‌. హారిస్‌ జైరాజ్‌ లాంటి మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ అతడికి కలుస్తున్నాడు. మరి అతను మహేష్‌ కోసం అతను ఎలాంటి ట్యూన్స్‌ సిద్ధం చేస్తాడో.. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లుగా మహేష్‌ ఎలాంటి మార్పు చూపిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు