కరీనాకు మగబిడ్డ.. ఆపండి బాస్

కరీనాకు మగబిడ్డ.. ఆపండి బాస్

హీరోయిన్లు 30 ప్లస్‌లో పడ్డారంటే.. వాళ్ల పెళ్లెప్పుడు అన్నది మీడియాకు హాట్ టాపిక్. పెళ్లి అయిపోయిందంటే.. ఇక ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ ఎప్పుడవుతుందనేది చర్చనీయాంశం. కరీనా కపూర్ ఈ రెండు విషయాల్లోనూ మీడియా నుంచి పెద్ద తలనొప్పులే ఎదుర్కొంది. మూడేళ్లుగా మీడియా నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు ఈ మధ్యే సమాధానం ఇచ్చేస్తూ ప్రెగ్నెంట్ అయిపోయింది. ఇప్పటికైనా చర్చ ఆగుతుందేమో అంటే.. ఆమె గురించి మరో ప్రచారం మొదలైంది. ఈ మధ్యే సైఫ్ అలీ ఖాన్.. కరీనాకపూర్ లండన్ పర్యటన చేసొచ్చిన సంగతి తెలిసిందే.

ఆ పర్యటన సందర్భంగా సైఫ్-కరీనా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారని.. మగ బిడ్డ అని తేలిందని ఓ ప్రముఖ మీడియా సంస్థ ఓ కథనం ప్రచురించింది. దీంతో వెంటనే కరీనా కపూర్ మేనేజర్ స్పందించాడు. కరీనా దంపతులు అలాంటి పరీక్షలేమీ చేయించుకోలేదని ప్రెస్ నోట్ ఇచ్చాడు. ‘‘మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాజనితం. నిరాధారమైనవి. కరీనా, సైఫ్ వీటిని ఖండించారు. లండన్ లో కరీనా, సైఫ్ దంపతులు ఏ వైద్యుడినీ సంప్రదించలేదు. కులాసాగా గడిపిరావడానికే అక్కడికి వెళ్లారు. ఇది వ్యక్తిగత విషయం. అనవసరంగా సంచలనం చేయవద్దని అందరినీ కోరుతున్నా’’ అని కరీనా మేనేజర్ పేర్కొన్నాడు. ఓ సెలబ్రెటీ ఇలాంటి ప్రెస్ నోట్ ఇవ్వాల్సి రావడం ఇదే తొలిసారేమో. కరీనాకు డిసెంబర్లో ప్రసవం జరిగే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English