సమంత ఎంత బ్రిలియంట్ స్టూడెంటంటే..

సమంత ఎంత బ్రిలియంట్ స్టూడెంటంటే..

ఈ తరం సౌత్ ఇండియన్ హీరోయిన్లలో మంచి నటి ఎవరు అంటే సమంత పేరు ముందు చెప్పుకోవాలి. ఈ మధ్యే ‘అఆ’ సినిమాలో తన నటనతో ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే సినిమాల్లోకి వచ్చిన వాళ్లు చాలామందికి చదువు సరిగా అబ్బలేదని అనుకుంటాం. కానీ సమంత అందుకు పూర్తి భిన్నం. ఆమె స్కూల్లో.. కాలేజీలో బ్రిలియంట్ స్టూడెంట్. ఈ రోజు ట్విట్టర్లో సమంత షేర్ చేసిన తన మార్కుల లిస్టులు చూస్తే ఈ సంగతి అర్థమైపోతుంది. డిగ్రీలో కామర్స్ తీసుకున్న ఆమె.. డిస్టింక్షన్లో పాసవడం విశేషం. చెన్నైలోని స్టెల్లా మేరీ కళాశాలలో ఆమె 2007లో డిగ్రీ పూర్తి చేసింది. ఫ్రెంచ్ లాంగ్వేజ్‌లో, ఇంగ్లిష్‌లో ఫస్ట్ క్లాస్ సాధించిన ఆమె.. కోర్ కోర్సులో డిస్టింక్షన్ సాధించింది.

ఇలా డిగ్రీ అవడం ఆలస్యం.. ఆమెకు సినిమాల్లో అవకాశం దక్కడం.. ‘ఏమాయ చేసావె’తో బ్రేక్ రావడం.. స్టార్ హీరోయిన్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. డిగ్రీలోనే కాదు.. స్కూల్ స్థాయిలో కూడా సమంత బ్రిలియంట్ స్టూడెంటే. స్కూల్ డేస్ మార్కుల లిస్టు కూడా ఆమె షేర్ చేసింది. 2002లో పదో తరగతి పూర్తి చేసిన సమంతకు హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో 887 మార్కులు సాధించింది. స్కూల్లో ఆమెదే ఫస్ట్ ర్యాంకు. మార్కుల కార్డు మీద.. సమంత తమ స్కూల్‌కు అస్సెట్ అని పేర్కొనడం విశేషం. మొత్తానికి చదువు రాకుంటేనే సినిమాల్లోకి వస్తారనే అభిప్రాయం తప్పు అనడానికి సమంతే రుజువన్నమాట. ఆమె సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఉన్నత చదువులు చదివి ఏ స్థాయికి వెళ్లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు