మళ్ళీ పూరితో బన్నీ???

మళ్ళీ పూరితో బన్నీ???

ఇప్పటికే దేశముదురు చేశారు, మరో రెండు వారాల్లో ఇద్దరమ్మాయిలతో అంటూ వస్తున్నారు. అయినా సరే వీళ్ళకు సాటిస్‌ఫ్యాక్షన్‌ లేదట. అందుకే మరోసారి చేతిలో చెయ్యివేసుకొని వచ్చేస్తారట. డేరింగ్‌ డైరక్టర్‌ పూరి జగన్నాథ్‌, స్టయిలిష్‌ హీరో అల్లు అర్జున్‌ కాంబినేషన్లో మరో కొత్త సినిమా వస్తుందని ఇప్పుడు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అవును, ఇద్దరమ్మాయిలతో షూటింగ్‌ చేస్తున్న సమయంలో, తన తదుపరి ప్రాజెక్టు ఒక మల్టీస్టారర్‌ అంటూ పూరి తన అనుచరులకు చెప్పాడట. ఆ కథ వినగానే అల్లూ అర్జున్‌ ఓకె చెప్పాడని, రెండో హీరో కోసం వెతికేస్తున్నారని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ముందుగా బన్నీ సురేందర్‌ రెడ్డి 'రేసు గుర్రం' సినిమా చెయ్యాలి, అలాగే పూరి జగన్‌ కూడా తమన్నాతో ఒక లేడి ఓరియెంటడ్‌ సినిమాను ఫినిష్‌ చేద్దామని చూస్తున్నాడు.

ఇకపోతే ఇద్దరమ్మాయిలతో సినిమా రిజల్ట్‌ తేలకుండా మరోసారి పూరితో ఎందుకు బన్నీ అంటూ కొంతమంది మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా టాలీవుడ్‌లో అన్నీ చాలా కొత్తగానే ఉంటాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English