పవన్ వెర్సస్ మహేష్ వెర్సస్ బన్నీ.. మళ్లీ

పవన్ వెర్సస్ మహేష్ వెర్సస్ బన్నీ.. మళ్లీ

ఈ ఏడాది సమ్మర్లో మన స్టార్ హీరోల మధ్య రసవత్తర పోరు సాగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టైలిష్ స్టార్ సరైనోడు.. వేసవి బరిలో నిలిచారు. ఐతే ఈ ముగ్గురి సినిమాల ఫలితాలు అంచనాలకు భిన్నంగా వచ్చింది. అన్నింట్లోకి ఎక్కువ పాజిటివ్ బజ్ ఉన్న ‘బ్రహ్మోత్సవం’ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. దీని తర్వాత ఎక్కువ అంచనాలున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పరిస్థితి ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ రెండు సినిమాలతో పోలిస్తే తక్కువ అంచనాలున్న ‘సరైనోడు’ మాత్రం సెన్సేషనల్ హిట్టయింది. మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్లను డామినేట్ చేసి.. తన స్టామినాను చూపించాడు బన్నీ.

ఐతే ఆశ్చర్యకరంగా వచ్చే ఏడాది సమ్మర్లో సైతం ఈ ముగ్గురూ బాక్సాఫీస్ రేసులో నిలవబోతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ముగ్గురి తర్వాతి సినిమాలు ఈ ఏడాది ఆఖర్లోనో.. వచ్చే ఏడాది ఆరంభంలోనో రావాల్సింది. కానీ అనుకోని కారణాలతో ఆలస్యమై..వచ్చే ఏడాది వేసవికే షెడ్యూల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్-ఎస్.జె.సూర్య సినిమాను సంక్రాంతికే అనుకున్నప్పటికీ.. సూర్య తప్పుకుని డాలీ రేసులోకి రావడంతో సినిమా ఆలస్యమయ్యేలా ఉంది. ఇది సమ్మర్‌కే వచ్చే అవకాశముంది. మరోవైపు మహేష్ బాబు-మురుగదాస్ సినిమా కూడా లేటైంది. దీన్ని కూడా వేసవికే అనుకుంటున్నారిప్పుడు. ఇక బన్నీ-హరీష్ శంకర్ సినిమాను కూడా దిల్ రాజు వేసవికే ఫిక్స్ చేశాడట. మరి వచ్చే ఏడాది ఈ ముగ్గురిలో పైచేయి సాధించేదెవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు