జులై 9.. సంతోషం, భయం అంటున్న జక్కన్న

జులై 9.. సంతోషం, భయం అంటున్న జక్కన్న

2015 జులై 10.. తెలుగు ప్రేక్షకులే కాదు.. మొత్తంగా భారతీయ సినీ ప్రేమికులెవ్వరూ కూడా ఈ తేదీని అంత సులువుగా మరిచిపోలేరు. ఆ రోజు ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఓ అదుÄతేమే చోటు చేసుకుంది. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ విజువల్‌ వండర్‌ 'బాహుబలి' థియేటర్లలోకి వచ్చింది. బాహుబలి బొమ్మ పడ్డాక ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఐతే అంత గొప్ప సినిమా తీసినప్పటికీ 'బాహుబలి' విడుదలకు ముందు దర్శక ధీరుడు రాజమౌళి చాలా ఒత్తిడికి.. భయానికి గురయ్యాడట. ఈ సంగతి ఈ రోజే ట్విట్టర్లో వెల్లడించాడు. బాహుబలి విడుదలకు ముందు రోజైన జులై 9.. తనకెంతో ముఖ్యమైన రోజని చెబుతూ.. ఆ రోజుతో ముడిపడ్డ రెండు విషయాల్ని ట్విట్టర్లో పంచుకున్నాడు జక్కన్న. సరిగ్గా 13 ఏళ్ల కిందట తనకు అత్యంత సంతోషాన్నిచ్చిన సినిమా 'సింహాద్రి' విడుదలైందని.. ఇక గత ఏడాది ఇదే తేదీకి బాహుబలి సినిమాకు సంబంధించి విపరీతమైన టెన్షన్‌ అనుభవిస్తూ ఉన్నానని రాజమౌళి వెల్లడించాడు.

'బాహుబలిః ది బిగినింగ్‌' విడుదలై ఆదివారంతో ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో బాహుబలి టీం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఇప్పటికే ఈ సంగతి నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించాడు. వారం రోజుల పాటు సంబరాలు ఉంటాయన్నాడు. ఆదివారం నాడు సోషల్‌ మీడియాలో బాహుబలి పెద్ద చర్చనీయాంశం అయ్యే అవకాశముంది. ట్విట్టర్‌ టాప్‌ ట్రెండింగ్స్‌ లో 'బాహుబలి'కి సంబంధించిన అంశాలే ఉండొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు