మారుతి సినిమా.. ప్రమోషన్ కామెడీగా ఉంది

మారుతి సినిమా.. ప్రమోషన్ కామెడీగా ఉంది

రెండు రోజుల కిందటే ‘అంతం’ అనే చిన్న సినిమా ఒకటి రిలీజైంది. రష్మి గౌతమ్ మినహాయిస్తే వేరే అట్రాక్షన్స్ ఏమీ లేని ఈ చిన్న సినిమాకు తొలి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్లుగా ప్రచారం మొదలుపెట్టేసింది చిత్ర బృందం. ఆ సినిమా స్థాయికి అది చాలా పెద్ద మొత్తం. అయినా ఈ లెక్కల్లో వాస్తవమెంతో అడిగే నాథుడు లేడు. ఈ సినిమా అయితే ఎవరో పేరు లేని వాళ్లు తీసింది కాబట్టి వదిలేద్దాం. దీనికి ముందు వారం మారుతి-దిల్ రాజుల నిర్మాణంలో ‘రోజులు మారాయి’ అనే సినిమా ఒకటి వచ్చింది. మంచి అంచనాల మధ్యే రిలీజైన ఈ సినిమాకు.. ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమాకు ఫస్ట్ డే నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది.

ఐతే కాంబినేషన్ క్రేజ్ వల్ల తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. కానీ ఈ చిత్ర బృందం మాత్రం రోజుకో కోటి రూపాయల కలెక్షన్ అంటూ ప్రతి రోజూ సోషల్ మీడియాలో ప్రోమోలు వదులుతోంది. తొలి రోజు కోటి రూపాయలు వచ్చాయట.. రెండో రోజుకు రెండు కోట్లట.. మూడో రోజు తర్వాత మూడు కోట్లట.. ఇలా రోజుకో కోటి రూపాయల కలెక్షన్ చెబుతోంది ‘రోజులు మారాయి’. వీకెండ్ అయ్యాక కలెక్షన్ల లెక్కలు కొంచెం సర్దుబాటు చేసి.. ఇప్పుడేమో ఏడు రోజుల్లో ఆరు కోట్లు అంటున్నారు. ఆఫీస్‌లో కూర్చుని.. పేపర్ మీద వేసిన లెక్కల్లాగా ఉన్నాయివి. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత భాగస్వామ్యం ఉన్న సినిమాకు ఇలాంటి ప్రచారం జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అసలీ సినిమా చూస్తే.. దిల్ రాజు ఎలా ఓకే చేశాడు, ఎలా ఇందులో భాగస్వామి అయ్యాడు అనిపిస్తుంది. ఊరికే ఆయన పేరును ప్రచారానికి వాడుకున్నారేమో అన్న సందేహాలు కలుగుతాయి. మొదట్నుంచి దిల్ రాజు ఈ సినిమాతో అంటి ముట్టనట్లే ఉంటున్నాుడ. ప్రమోషన్ విషయంలో ఆయన ప్రమేయం ఏమీ ఉన్నట్లుగా అనిపించడం లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు