రష్మి బాయ్ కాట్ చేసింది అందుకా?

రష్మి బాయ్ కాట్ చేసింది అందుకా?

‘గుంటూరు టాకీస్’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అందుకు ప్రధాన కారణం రష్మి గౌతమ్ అంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఆమె హాట్ హాట్ అందాలే ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కుర్రాళ్లను థియేటర్లకు రప్పించాయి. రష్మికి యూత్ లో ఎంత క్రేజ్ ఉందో అప్పుడే అందరికీ తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో ‘అంతం’ అనే సినిమా తీసిన దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్ కు తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా ‘గుంటూరు టాకీస్’ చూశాకే అర్థమైనట్లుంది. రష్మి మీద తీసిన ఓ హాట్ హాట్ సాంగ్ ను ఫుల్లుగా వాడేసుకుంటూ ప్రోమోలు కట్ చేసి జనాల్లో బాగానే ఆసక్తి రేకెత్తించాడతను.

ఐతే ఈ సినిమా ప్రమోషన్లలో ఎక్కడా కూడా రష్మి గౌతమ్ కనిపించకపోవడం.. ఈ చిత్రం గురించి ఎక్కడా ఒక బైట్ కూడా ఇవ్వకపోవడం.. తన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఎక్కడా ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం గమనించవచ్చు. ఈ సినిమాతో తనకేమీ సంబంధం లేనట్లు ఆమె సైలెంటుగా ఉండటానికి కారణం లేకపోలేదు. ముందు ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్ర అని చెప్పారట. కేవలం వారం రోజుల డేట్లే అడిగారట. ఆ ప్రకారమే డేట్లు ఇవ్వడం.. షూటింగ్ చేయడం జరిగింది. ఐతే అదే సమయంలో ‘గుంటూరు టాకీస్’ విడుదలై రష్మి పేరు మార్మోగింది. దీంతో ప్లాన్ మారింది. రష్మినే ముందు పెట్టి సినిమాను సేల్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆమె రోల్ పెంచుదామని భావించి.. అదనంగా డేట్లు అడిగితే అదనపు పారితోషకం అడిగిందట. ఆమె అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో రష్మి  కోఆపరేట్ చేయలేదు. దీనికి తోడు తన పాత్ర చిన్నదే అయినా.. తన అందాలతో ఎరవేసి సినిమాకు బిజినెస్ చేసుకోవడం.. తనను మరీ బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయడం చూసి ఆమెకు చిర్రెత్తుకొచ్చిందట. అందుకే ఈ సినిమాతో తనకేం సంబంధం లేనట్లు సైలెంటుగా ఉండిపోయింది రష్మి. ప్రమోషన్లలో కూడా పాల్గొనలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు