రాఘవేంద్రరావు ఎంత స్ట్రిక్టంటే..

రాఘవేంద్రరావు ఎంత స్ట్రిక్టంటే..

సినిమా మొదలవుతున్నపుడు పూజలు అందరూ చేస్తారు. కానీ షూటింగ్ టైంలో యూనిట్ సభ్యులందరూ చెప్పుల్లేకుండా పని చేయడం.. సెల్ ఫోన్లు ఉపయోగించకపోవడం.. ఒకే రకమైన యూనిఫాంతో రావడం.. ఇలా పద్ధతులు పాటించడం అన్నది ఏ సినిమా షూటింగ్‌లో అయినా జరుగుతుందా..? రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ షూటింగ్ స్పాట్లో మాత్రం ఇదంతా చూడొచ్చు. వేంకటేశ్వరస్వామి భక్తుడైన హథీరాం బాబా జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ భక్తి రస చిత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్నాడు దర్శకేంద్రుడు. టీటీడీ పాలకమండలి సభ్యుడు కూడా కావడంతో ఆయనలో భక్తి పాళ్లు మరింత పెరిగినట్లున్నాయి.

గతంలో ‘అన్నమయ్య’ షూటింగ్ సందర్భంగానూ నియమ నిష్టలతో వ్యవహరించిన రాఘవేంద్రరావు.. ‘ఓం నమో వెంకటేశాయ’ వచ్చేసరికి మరింత స్ట్రిక్టుగా మారిపోయారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తెల్లటి దుస్తులే ధరించాలి. మగవాళ్లు కుర్తా పైజామానే వేసుకోవాలి. నుదుటన నిలువు బొట్టు పెట్టుకోవాలి. ఎవ్వరూ చెప్పులు ధరించడానికి వీల్లేదు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవీ ఉపయోగించకూడదు. స్నానం చేయకుండా.. శుభ్రత లేకుండా ఎవ్వరూ షూటింగ్ స్పాట్లో కనిపించకూడదు. ఇంత పద్ధతిగా షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన గుడి సెట్లో నాలుగు రోజుల కిందటే ‘ఓం నమో వెంకటేశాయ’ షూటింగ్ ఆరంభమైన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేయనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English