నాగ్‌ తో శ్రీకాంత్‌ తనయుడి జగడం..

నాగ్‌ తో శ్రీకాంత్‌ తనయుడి జగడం..

అవును.. మీరు చూసింది నిజమే. మన్మథుడు నాగార్జునతో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ గొడవ పెట్టుకున్నాడు. ఛాలెంజ్‌ కూడా చేసాడు. కానీ ఇదంతా రియల్‌ లైఫ్‌ లో కాదు.. రీల్‌ లైఫ్‌ లో. రోషన్‌ ఇప్పుడు నిర్మలా కాన్వెంట్‌ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. నాగ కోటేశ్వర్రావ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో రోషన్‌ కు జోడీగా శ్రీయశర్మ నటిస్తోంది. జై చిరంజీవ సినిమాలో నటించిన చిన్నపిల్లే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్‌. ఇందులో నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు.. నిర్మలా కాన్వెంట్‌ సినిమాకు ఆయనే నిర్మాత కూడా.

నిర్మలా కాన్వెంట్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు నాగార్జున. మొన్నీమధ్యే సినిమాకు ప్రత్యేకమైన ప్రమోషనల్‌ సాంగ్‌ కూడా చేసాడు నాగ్‌. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. కొత్తగా రీ ఫ్రెషింగ్‌ ప్రేమకథగా కనిపిస్తోంది ట్రైలర్‌. మధ్యలో నాగార్జున డైలాగ్స్‌.. రోషన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ సినిమాకు హైప్‌ పెంచేస్తోంది. ఈ సినిమాలో ఉన్న మరో స్పెషాలిటీ.. స్టార్‌ కిడ్స్‌ అంతా కలిసి పనిచేయడం. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరో అయితే.. కోటి తనయుడు రోషన్‌ సంగీత దర్శకుడు.. ఇక ఏఆర్‌ రెహమాన్‌ తనయుడు ఈ సినిమా కోసం పాట పాడాడు. మొత్తానికి క్యూట్‌ లవ్‌ స్టోరీగా వస్తోన్న నిర్మలా కాన్వెంట్‌ ప్రేక్షకులకు కూడా ఇంతే క్యూట్‌ గా అనిపిస్తుందా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు