శ్రియ ఎవరికి తల్లిగా నటిస్తోందో చూశారా..

శ్రియ ఎవరికి తల్లిగా నటిస్తోందో చూశారా..

ఆల్రెడీ ‘దృశ్యం’ సినిమాలో వయసు పిల్లల తల్లిగా నటించింది శ్రియ. ఆ దెబ్బతో ఆమెకిక హీరోయిన్ అవకాశాలు అడుగంటిపోయినట్లే అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా బాలయ్య సరసన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశం దక్కించుకుంది బక్కపలచని భామ. ఐతే అందులో కూడా ఆమె ఓ పిల్లాడికి తల్లిగానే నటించబోతోంది. ఐతే ఇలాంటి పాత్రలు చేయడం వేరు.. ఓ పేరున్న కథానాయకుడిగా తల్లిగా నటించడం వేరు. శ్రియ ఇప్పుడు అలాంటి సాహసమే చేయబోతున్నట్లు సమాచారం. తమిళ కథానాయకుడు శింబుకు ఆమె తల్లిగా నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

‘ఎఎఎ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శింబు త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి నడి వయసు పాత్ర. ఆ పాత్రకు జోడీగా శ్రియ నటిస్తుందట. వీళ్లిద్దరికి ఇంకో శింబు కొడుగ్గా ఉంటాడు. శ్రియ తొలిసారి మిడిలేడ్జ్ పాత్రకు తగ్గట్లు మేకప్ వేసుకోబోతోందన్నమాట. ఇంతకుముందు ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’లో సిమ్రాన్ సైతం ఇలాంటి పాత్రే చేసింది. అంతకుముందు వరకు సిమ్రాన్ ను గ్లామర్ డాల్ గా చూసి.. అలా వయసు మళ్లిన పాత్రల్లో చూసేసరికి ఆమె అభిమానులు తట్టుకోలేకపోయారు. సిమ్రాన్ కు మళ్లీ మామూలు హీరోయిన్ పాత్రలు రాలేదు. శ్రియ కెరీర్ కూడా ప్రస్తుతం చరమాంకంలో ఉంది. ఈ పాత్రతో హీరోయిన్ వేషాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు