ఇప్పుడప్పుడే బలుపు రాదట

ఇప్పుడప్పుడే బలుపు రాదట

మన మాస్‌రాజా రవితేజ వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతూ,  ఎలాగైనా ఈ సారి నా బలుపు చూపించాలి అని డిసైడ్‌ చేసుకొని మరీ 'బలుపు' అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌తో వస్తున్నాడు. డాన్‌శీను సినిమా రూపొందించిన గోపిచంద్‌ మలినేనికి మరో అవకాశం ఇచ్చి, ఈ సినిమా మీద కొండంత ఆశలు పెట్టుకున్నాడు రవితేజ.

అయితే సినిమా మే నెలలో వచ్చేస్తుందని మాస్‌ అభిమానులు కలలు కంటున్నారేమో, అంత సీన్‌ లేదు. ఇప్పుడప్పుడే బలుపు వచ్చే దాఖలాలు కనిపించడంలేదు. ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న దానిప్రకారం బలుపు సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో టాకీ పార్టు, ఆ తరువాత బ్యాంకాక్‌లో మరో షెడ్యూల్‌ చేస్తేకాని బలుపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశకు చేరుకోదని అర్దమవుతోంది.

దీని బట్టి చూస్తే సినిమా ఖచ్చితంగా జులై నెల అంతంలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా. నిజం చెప్పాలంటే సినిమాను మే నెలలో విడుదలచెయ్యడానికే ప్లాన్‌ చేశారు కాని, మరి షూటింగ్‌ ఇంత జాప్యం ఎందుకవుతుందో తెలియడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English