నయనతార షాకింగ్ స్టేట్మెంట్

నయనతార షాకింగ్ స్టేట్మెంట్

30వ పడిలో పడగానే హీరోయిన్ల కెరీర్ ముగిసినట్లే అనుకుంటారంతా. మహా అయితే ఒకట్రెండేళ్లు కెరీర్ పొడిగించుకోవచ్చు. అంతకుమించి అంటే కష్టం. అవకాశాలు తగ్గిపోతాయి. చాలామంది పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోతుంటారు. ఐతే ఆల్రెడీ 31 ఏళ్లున్న నయనతారకు మాత్రం ఇప్పుడిప్పుడే రిటైరయ్యే ఆలోచనలేమీ ఉన్నట్లు లేవు. కనీసం ఇంకో ఐదేళ్లు పెళ్లి చేసుకునే ఉద్దేశమే తనకు లేదంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది నయన్. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో తన ప్రేమాయణం.. తన పెళ్లి గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే. విఘ్నేష్‌ దర్శకుడిగానే కాకుండా నాకు మంచి స్నేహితుడు మాత్రమే. స్నేహితుడితో క్లోజ్‌గా మూవ్‌ అయితే అతణ్ని ప్రేమించినట్లా.. పెళ్లి చేసుకోబోతున్నట్లా? మా మధ్య అలాంటిదేమీ లేదు. నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. ఓ ఐదేళ్లు పట్టొచ్చేమో. అంతకంటే ఎక్కువ సమయం పట్టినా పట్టొచ్చు. మనసుకి నచ్చిన వ్యక్తి దొరికినపుడు పెళ్లి గురించి ఆలోచిస్తా’’ అని చెప్పింది నయన్.

‘బాబు బంగారం’ సినిమా నిర్మాతను ఇబ్బంది పెడుతున్నట్లు వస్తున్న వార్తలపై నయన్ స్పందిస్తూ.. ‘‘ఆ సినిమాకు నేనిచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్ చేయలేదు. సినిమా ఆలస్యమైంది. దీనికి నేను బాధ్యురాలినా? నా డేట్లన్నీ అయిపోయాక మరికొన్ని డేట్లు అడిగారు. పది రోజులు ఇచ్చాను. అయినా సినిమా పూర్తవలేదు. నేనేదో ఇబ్బందిపెడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. నేను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాను. టైంకి వస్తా.. టైంకి వెళ్లిపోతా. అగ్రిమెంట్లో ఉన్న ప్రకారం నడుచుకుంటా’’ అని నయన్ పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు