చైతూ వెడ్స్ సమంత డేట్ ఫిక్సయిపోయిందా?

చైతూ వెడ్స్ సమంత డేట్ ఫిక్సయిపోయిందా?

టాలీవుడ్లో ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. పెళ్లి దిశగా టర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య-సమంత రూత్ ప్రభుల విషయంలో ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయినట్లే కనిపిస్తోంది. చైతూ తండ్రి నాగార్జునే స్వయంగా వీళ్లిద్దరి ప్రేమ గురించి మీడియాలో పాజిటివ్‌గా మాట్లాడటంతో ఇక వీరి పెళ్లికి అడ్డంకులేమీ లేనట్లు తేలిపోయింది. ఆల్రెడీ రామానాయుడు కుటుంబం నుంచి కూడా క్లియరెన్స్ వచ్చేసింది. చైతూ తల్లి లక్ష్మికి సమంత నచ్చేయడం.. ఆమె చెన్నైలో ఒకరోజంతా ఆమెతో గడిపి తన కొడుక్కి ఈ అమ్మాయి ఓకే అని సర్టిఫై చేసేయడంతో పెళ్లికి పూర్తిగా లైన్ క్లియర్ అయిపోయింది. రెండు కుటుంబాల నుంచి అంగీకారం లభించడంతో పెళ్లి డేటు మీద కూడా ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.

ఓ ప్రముఖ తెలుగు పత్రిక కథనం ప్రకారం డిసెంబర్లో చైతూ-సమంతల పెళ్లి చేయడానికి అంగీకారం కుదిరిపోయిందట. నాగ్ కుటుంబాన్ని సంప్రదించాకే ఈ కథనం వేసినట్లు సమాచారం. మరోవైపు నాగ్ చిన్న కొడుకు అఖిల్ పెళ్లి కూడా అప్పుడే చేసేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అఖిల్.. శ్రియ అనే డిజైనర్‌ను ప్రేమిస్తున్నసంగతి తెలిసిందే. నాగ్ సైతం పేరు చెప్పకుండా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. అన్నదమ్ములిద్దరి పెళ్లిళ్లు ఒకే టైంలో చేసేయడం గురించి నాగ్ తీవ్రంగానే ఆలోచిస్తున్నాడట. కాకపోతే అఖిల్ తన ప్రేమ విషయంలో అంత సీరియస్‌గా ఉన్నాడా.. అతడి వయసు మరీ తక్కువేమో అన్న డిస్కషన్ నడుస్తోంది. చిన్నోడి సంగతేమైనా చైతూ-సమంతల పెళ్లయితే డిసెంబర్లో ఖాయమని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు