నానికి జ్ఞానోదయం..

నానికి జ్ఞానోదయం..

ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాలంటే కావాల్సింది విజయాల కంటే ముందు మాస్ ఇమేజ్. అది ఉంటే చాలు ఎన్నాళ్లైనా ఇండస్ట్రీలో బతికేయొచ్చు.. బండి లాగించొచ్చు. పవన్, మహేశ్, ఎన్టీఆర్ లాంటి హీరోలేమైనా వరసగా హిట్లు ఇస్తారా.. అప్పుడొక్కటి ఇప్పుడొక్కటి ఇస్తుంటారు. అయినా వాళ్ల ఇమేజ్ ఆ స్థాయిలో ఉందంటే కారణం మాస్ లో ఉన్న క్రేజ్. నానికి ఇన్నాళ్లకు ఈ సూత్రం అర్థమైంది. వరసగా నాలుగు విజయాలు అందుకున్నా.. నానిలో మాత్రం ఏదో తెలియని కొరత కనిపిస్తుంది. అది కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్ మన్ తో అర్థమైంది కూడా. ఈ రెండు సినిమాలకు సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది.. కానీ కలెక్షన్లు మాత్రం యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి. దానికి కారణం నానికి మాస్ లో ఫాలోయింగ్ లేకపోవడమే. అదే నాని మాస్ హీరో అయ్యుండుంటే ఈ రెండు సినిమాలు దుమ్ము దులిపేసేవి.

దాంతో ఇప్పుడు నాని ఫోకస్ మొత్తం మాస్ ఇమేజ్ వైపు వెళ్లింది. ప్రస్తుతం విరించి వర్మతో చేస్తోన్న సినిమాలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా నటిస్తున్నాడు. ఇది తన రియల్ లైఫ్ పాత్రే. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. అందుకే ఈ సినిమాకు మజ్ను అనే టైటిల్ పరిశీలిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక దీంతోపాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. నేను లోకల్ అనే టైటిల్ దీనికి పరిశీలిస్తున్నారు. ఇది పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్. గతంలో సినిమా చూపిస్త మావాతో త్రినాథరావ్ చేసిన మ్యాజిక్ తెలిసిందే. ఇప్పుడు ఇదే చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాకు దేవీ స్వరాలు అందిస్తుండటం విశేషం. ఈ సినిమా గనక హిట్టైతే నానికి మాస్ లో కూడా మంచి ఫాలోయింగ్ రావడం ఖాయం. చూడాలిక.. నాని మాస్ కలలు ఎప్పటికి నెరవేరేనో..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు