మెగా మేనల్లుడు లైఫ్‌ టైం ఛాన్స్‌ కొట్టేశాడు

మెగా మేనల్లుడు లైఫ్‌ టైం ఛాన్స్‌ కొట్టేశాడు

ఒక ఆడియో వేడుకలో ఆ సినిమాతో ఏమాత్రం సంబంధం లేని దర్శకుడో.. హీరోనో.. నిర్మాతో ఉన్నాడంటే.. ఆ వ్యక్తి ఆ సినిమాకు సంబంధించిన వ్యక్తులతో తర్వాత ఓ సినిమా చేయబోతున్నాడని అర్థం. చాలావరకు కొత్త కాంబినేషన్ల గురించి ఇలాంటి వేడుకలే హింట్‌ ఇస్తుంటాయి. మొన్నామధ్య 'సాహసం శ్వాసగా సాగిపో' ఆడియో వేడుకలో సాయిధరమ్‌ తేజ్‌ కనిపించినపుడు చాలామందికి సంగతేంటో అర్థం కాలేదు. సాయి ఏమీ చైతూకు ఫ్రెండు కూడా కాదు. అయినా ఆ వేడుకలో అతనుండటానికి ఓ కారణముందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. 'సాహసం శ్వాసగా..' దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్లో సాయిధరమ్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ఒకే కథను వేర్వేరు భాషల్లో వేర్వేరు హీరోలతో తీయడం గౌతమ్‌ కు అలవాటు. ఘర్షణ.. ఏమాయ చేసావె.. ఎటో వెళ్లిపోయింది మనసు.. లేటెస్టుగా 'సాహసం శ్వాసగా సాగిపో'.. ఇవన్నీ కూడా అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ తెరకెక్కాయి. సాయిధరమ్‌ తో చేయబోయేది ఏకంగా నాలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కబోయే సినిమా అట. ఇందులో ఒక్కో భాష నుంచి ఒక్కో హీరో నటించడం కాదు. సౌత్‌ ఇండియాలోని నాలుగు ఇండ్ట్రీల నుంచి నలుగురు హీరోలు ఈ సినిమాలో కలిసి నటించబోతున్నారు. తమిళం నుంచి జయం రవి.. కన్నడ నుంచి పునీత్‌ రాజ్‌ కుమార్‌.. మలయాళం నుంచి ప థ్వీరాజ్‌లకు అవకాశం దక్కగా.. తెలుగు నుంచి సాయిధరమ్‌ ఎంపికయ్యాడు. ఈ చిత్రంలో అనుష్క, తమన్నా కథానాయికలుగా నటిస్తారు. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సాయిధరమ్‌కు ఇది లైఫ్‌ టైం ఛాన్స్‌ అనే చెప్పాలి. ఈ సినిమా కార్యరూపం దాల్చితే.. సాయిధరమ్‌ హీరోగా నెక్స్ట్‌ లెవెల్‌ కు వెళ్లిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English