బాహుబలి మళ్లీ రచ్చ చేయబోతోంది

బాహుబలి మళ్లీ రచ్చ చేయబోతోంది

2015 జులై 10.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన రోజు. ఆ రోజే ‘బాహుబలి’ అనే విజువల్ వండర్ భారతీయ ప్రేక్షకుల్ని పలకరించింది. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందెన్నడూ చూడని అద్భుత దృశ్యాల్ని వెండితెరపై ఆవిష్కరించి.. దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని మైమరిచిపోయేలా చేశాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా.. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒకచోట ప్రకంపనలు రేపుతూనే ఉంది ‘బాహుబలి’. బుల్లి తెరలో ‘బాహుబలి’ వస్తోందంటే చాలు.. టీవీలకు అతుక్కుపోతున్నారు జనాలు. ఐతే ‘బాహుబలి’ లాంటి స్పెక్టాకులర్ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూస్తే కలిగే అనుభూతే వేరు. ఆ అనుభవాన్ని కొందరు ప్రేక్షకులు మిస్సయ్యారు.

థియేటర్లలో ఉండగా పట్టించుకోని ఆ జనాలు.. ఆ తర్వాత రిగ్రెట్ అయ్యారు. అలాంటి వాళ్ల కోసమే ఈ జులైలో మళ్లీ ‘బాహుబలి’ని థియేటర్లలోకి తెస్తున్నట్లు సమాచారం. జులై 10కి బాహుబలి విడుదలై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ‘బాహుబలి’ని రీరిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడ మాత్రమే కాదు.. కేరళలో.. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ‘బాహుబలి’ని థియేటర్లలోకి తేనున్నారట. కేరళలో గ్లోబల్ మీడియా అనే సంస్థ.. ‘బాహుబలి’ని పెద్ద ఎత్తునే రీరీలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అక్కడ ఈ సినిమా గత ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించి.. డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు