మారుతి.. ది మ‌నీ మిష‌న్..!

మారుతి.. ది మ‌నీ మిష‌న్..!

కుర్ర దర్శకుడు మారుతికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. చచ్చిపోతున్న చిన్న సినిమాలకు మళ్లీ ఊపిరి ఊదిన ఘనత మారుతిదే. ఈ క్రమంలో కెరీర్ మొదట్లో కాస్త బూతు సినిమాలు చేసుండొచ్చు గానీ అవి గుర్తింపు తెచ్చుకునేంత వరకే. ఒక్కసారి క్రేజ్ వచ్చిన తర్వాత మారుతి బూతును పూర్తిగా మానేసాడు. క్లీన్ సినిమాలు చేస్తున్నాడు. భలేభలే మగాడివోయ్ తో మారుతి ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం వెంకటేశ్ తో బాబు బంగారం సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇది కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనరే.

ఈ సినిమా గనక హిట్టైతే ఆటోమేటిక్ గా మారుతి రేంజ్ పెరగడం ఖాయం. ఆయనతో సినిమా కోసం చాలా మంది హీరోలు పోటీ పడతారు. మారుతి బుర్ర ఎప్పుడూ మనీ చుట్టూనే తిరుగుతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. డబ్బు ఎలా సంపాదించాలో మారుతికి బాగా తెలుసంటారు ఆయన సన్నిహితులు. దర్శకుడిగా ఇప్పుడు సినిమాకు కోటికి పైగానే అందుకుంటున్నాడు మారుతి. ఇక మరోవైపు తన మారుతి ప్రొడక్షన్స్ లో చిన్న సినిమాలు నిర్మిస్తుంటాడు. వాటితో కూడా బాగానే వెనకేసుకుంటాడు. ఇది చాలదన్నట్లు రైటర్ గానూ నాలుగు రాళ్లు వెనకేస్తున్నాడు మారుతి. ప్రేమకథాచిత్రం, లవర్స్.. ఇప్పుడు విడుదలకు సిద్ధమైన రోజులు మారాయి, రాజ్ తరుణ్ తో రాజుగాడు.. యమ డేంజర్ సినిమాలకు కూడా కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. వీటికి కూడా మారుతి భారీ పారితోషికమే అందుకుంటున్నాడు.

గతంలోనూ తన పేరు వాడుకుని కొన్ని బూతు సినిమాలు చేసారు చిన్న దర్శకులు. అప్పుడు కూడా తన పేరు వాడుకున్నందుకు కొన్ని డబ్బులు వసూలు చేసాడని మారుతిపై ఓ విమర్శ ఉంది. కెరీర్ లో ఎదుగుతున్న క్రమంలో డబ్బుకు బెండ్ అయితే కెరీర్ కూడా మధ్యలోనే బెండ్ అయిపోవడం ఖాయమని మారుతికి కొందరు అంటుంటే.. డబ్బు సంపాదించే మార్గం తెలిసినపుడు సంపాదించడంలో తప్పేముందని మారుతిని సపోర్ట్ చేస్తున్నారు మరికొందరు. మొత్తానికి టాలీవుడ్ లో న్యూ మని మిషన్ గా మారిపోయాడు మారుతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు