పార్లమెంటు, ఎర్రకోటల్ని కూల్చేయబోతున్న శంకర్

పార్లమెంటు, ఎర్రకోటల్ని కూల్చేయబోతున్న శంకర్

ఈ మధ్యే ‘ఇండిపెండెన్స్ డే.. ది రిసర్జన్స్’ సినిమా రిలీజైంది. అందులో ప్రపంచంలోనే ప్రముఖ నగరాలన్నీ కూలిపోతున్న దృశ్యాలు చూపిస్తారు. ఐతే లండన్.. న్యూయార్క్ లాంటి ప్రఖ్యాత నగరాలు కూలిపోతున్నట్లు చూపించారు కానీ.. మన ఇండియన్ సిటీస్ ఏవి కూడా అందులో కనిపించవు. భారతీయులు చాలా సెన్సిటివ్ అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందట చిత్ర బృందం. ఇంతకుముందు ఓ సినిమాలో తాజ్ మహల్ కూల్చేసినట్లు చూపిస్తే ఇక్కడి ప్రేక్షకులు నొచ్చుకున్నారని.. అందుకే ‘ఇండిపెండెన్స్ డే’లో ఇండియన్ సిటీస్ జోలికి వెళ్లలేదని చెప్పారు. ఐతే భారతీయుల సెంటిమెంటు గురించి హాలీవుడ్డోళ్లు అంతగా ఆలోచించారు కానీ.. మన సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ మాత్రం ఇలాంటి మొహామాటాలేం పెట్టుకోవట్లేదు.

రోబో-2 సినిమాలో పార్లమెంటు, ఎర్రకోట సహా దేశంలోనే ప్రముఖ భవనాలు, చారిత్రక కట్టడాల్ని కూల్చే సన్నివేశాలు ఉంటాయట. విలన్ విశృంఖలంగా తయారయ్యే క్రమంలో ఈ భీభత్సం జరుగుతుందట. రోబో సాయంతో విలన్ అక్షయ్ కుమార్ ఈ విధ్వంసానికి తెర తీస్తాడట. ఈ సన్నివేశాల కోసం ఇప్పటికే అనుమతి కూడా తెచ్చుకున్నాడట శంకర్. ఐతే ఈ సన్నివేశాలేవీ ఒరిజినల్ ప్రాంతాల్లో చిత్రీకరించట్లేదు. అంతా కూడా వీఎఫ్ఎక్స్ ద్వారా ఈ సన్నివేశాలను సృష్టించబోతున్నాడు శంకర్. ఈ సీన్స్ హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటాయట. ప్రస్తుతం రజినీకాంత్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయనొచ్చే లోపు ఇప్పటిదాకా తీసిన సన్నివేశాలకు విజువల్ ఎఫెక్టులు జోడించే పనిలో బిజీగా గడపబోతున్నాడు శంకర్. ఇప్పటికే రోబో-2 చిత్రీకరణ 50 శాతం పూర్తయినట్లు శంకరే వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు