దిల్ రాజు ఆ సినిమాలోకి ఎందుకొచ్చాడంటే..

దిల్ రాజు ఆ సినిమాలోకి ఎందుకొచ్చాడంటే..

ద‌ర్శ‌కుడిగా కాస్త పేరు రాగానే నిర్మాణంలోకి అడుగుపెట్టేశాడు దాస‌రి మారుతి. ఇప్ప‌టికే అత‌ను చాలా చిన్న సినిమాల్ని నిర్మించాడు. కొన్నింటికి ర‌చ‌నా స‌హ‌కారం కూడా అందించాడు. ఐతే మారుతి క‌థ‌తో.. అత‌డి నిర్మాణంలో తెర‌కెక్కిన ‘రోజులు మారాయి మీద మిగ‌తా సినిమాల‌న్నింటి కంటే అంచ‌నాలు ఎక్కువున్నాయి. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాణ భాగ‌స్వామి కావ‌డం కూడా ఓ కార‌ణం. ఇంత‌కీ మారుతి బ్రాండ్ సినిమాలోకి దిల్ రాజు ఎందుకొచ్చాడన్న‌ది ఆస‌క్తిక‌రం. దీని గురించి మారుతి ఏం చెబుతున్నాడో చూద్దాం ప‌దండి.

‘‘దిల్ రాజు అన్న ఈ ప్రాజెక్టుకి రావడం మ్యాజిక్ లాగా జరిగిపోయింది. ‘రోజులు మారాయి’లో ఓ పాత్ర కోసం ‘కేరింత’లో నటించిన పార్వతీశం స‌రిపోతాడ‌నిపించి.. అత‌ణ్ని అడిగాను. ఐతే దిల్‌రాజుతో అతడికి అగ్రిమెంట్ ఉందని తెలిసింది. అప్పుడే దిల్ రాజుకి ఈ కథ చెప్పాను. ఈ కథేదో బాగుందే.. సరదాగా నేనూ కో ప్రొడ్యూస్ చేస్తా అంటూ ఆయ‌న ముందుకొచ్చారు. నిర్మాణ భాగ‌స్వామి అయ్యారు’’ అని మారుతి చెప్పాడు.

‘రోజులు మారాయి’కి తాను ర‌చ‌న మాత్ర‌మే చేశాన‌ని.. ద‌ర్శ‌క‌త్వం విష‌యంలో త‌న జోక్యం ఎంత‌మాత్రం లేద‌ని మారుతి చెప్పాడు. ‘‘ద‌ర్శ‌క‌త్వం విష‌యంలో అస్స‌లు వేలు పెట్ట‌లేదు. నేను నా సినిమాతో బిజీగా ఉన్నా. ఒక్కసారి కథ పూర్తి చేసి దర్శకుడు మురళికి ఇచ్చాక అంతా అత‌నే చూసుకున్నాడు. మొన్నే సినిమా చూసినప్పుడు నేనెలా తీసేవాడినో అత‌నూ అలాగే తీశాడనిపించింది’’ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు