ప‌వ‌న్ సినిమా బ‌డ్జెట్ వంద కోట్లా?

ప‌వ‌న్ సినిమా బ‌డ్జెట్ వంద కోట్లా?

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బడ్జెట్ వంద కోట్లట.. ఈ సినిమా అంతటా పవన్ పంచె కట్టులోనే కనిపిస్తాడట.. ఈ ముచ్చట్లు చెప్పింది ఎవరో కాదు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల గురించి తప్పుకుని అందరికీ షాకిచ్చిన ఎస్.జె.సూర్య. పవన్ సినిమాకు టాటా చెప్పడానికి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతనీ విషయాలు వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు బయటికి వచ్చింది. ఇంతకీ పవన్ సినిమా గురించి సూర్య ఏమన్నాడంటే..

''పవన్ కళ్యాణ్ తో ఒకప్పుడు 'ఖుషి" చేయడం వేరు. ఇప్పుడు సినిమా చేయడం వేరు. ఇప్పుడున్న స్థితిలో పవన్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. పవన్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఓ రేంజిలో సెలబ్రేట్ చేస్తున్నారు. ఆయన సినిమా బడ్జెట్ వంద కోట్లు. ఇలాంటి సినిమాను హ్యాండిల్ చేయడానికి ప్రొఫెషనల్ అయి ఉండాలి. 'క్షత్రియ పుత్రుడు'లో కమల్ హాసన్ తరహాలో పవన్ పంచెకట్టులో కనిపిస్తాడిందులో. రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుంది. ఓ ఫ్యాక్షనిస్టు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది ఈ కథ. తన కెరీర్లో పవన్ ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి గెటప్ కూడా ఎప్పుడూ వేయలేదు. నాకు రాయలసీమ గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే ఆకుల శివ అనే రచయిత సహకారంతో ఈ కథ సిద్ధం చేశాను. 8 నెలలు కష్టపడి స్క్రిప్టు పూర్తి చేశాం"" అని సూర్య చెప్పాడు.

తాను మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు విలన్ గా ఎంపికైన సంగతి పవన్ కు చెప్పానని.. ఆయన ఓ బ్రదర్ లాగా ఎంతో సంతోషించి.. తనను హగ్ చేసుకున్నాడని సూర్య వెల్లడించాడు. పవన్ చాలా జెన్యూన్ వ్యక్తి అని ఈ ఇంటర్వ్యూలో సూర్య కితాబిచ్చాడు. కొమరం పులి ఫ్లాపైనా ఆ సినిమా విషయంలో తన కష్టాన్ని ఆయన గుర్తించారని సూర్య అన్నాడు. ఇద్దరికీ ఇంత మంచి అవగాహన ఉన్నపుడు ఈ సినిమా నుంచి సూర్య వెళ్లిపోవాల్సి న పరిస్థితి ఎందుకొచ్చిందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు