జెంటిల్‌మన్.. హిట్ ఆర్ ఫ్లాప్?

జెంటిల్‌మన్.. హిట్ ఆర్ ఫ్లాప్?

కొన్ని సినిమాలకు టాక్ డివైడ్‌గా వస్తుంది. అయినా అవి హిట్టయిపోతాయి. ఇంకొన్ని సినిమాలకు చాలా మంచి టాక్ వస్తుంది. కానీ కలెక్షన్లు ఆశడవు. ఈ సమ్మర్లో రిలీజైన సరైనోడు.. 24 సినిమాలే ఇందుకు నిదర్శనం. ‘సరైనోడు’ మొదట డివైడ్ టాక్‌ వచ్చినా భీభత్సమైన హిట్టయి కూర్చుంది. ‘24’కు చాలా మంచి రివ్యూలొచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.

సుప్రీమ్ సినిమా విషయంలోనూ ఊహించనిదే జరిగింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. రూ.25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక లేటెస్ట్ మూవీ ‘జెంటిల్‌మన్’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది. రివ్యూలన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. కానీ ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్లు ఓ మోస్తరుగా ఉన్నా.. ఆ తర్వాత బాగా డ్రాప్ అయ్యాయి. వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.13 కోట్లే వసూలు చేసింది.

దీంతో ‘జెంటిల్‌మన్’ ఫైనల్‌గా కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యేలా కనిపించింది. టాక్ ప్రకారం హిట్ అనుకున్నా.. కలెక్షన్ల ప్రకారం చివరికి ‘ఫ్లాప్’ అని తేలుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే తర్వాతి వారం రిలీజైన సినిమాలకు ఆశించిన ఫలితం రాకపోవడంతో ‘జెంటిల్‌మన్’ పరిస్థితి మెరుగైంది.

రెండో వారంలోనూ ‘జెంటిల్‌మన్’ సినిమానే బాక్సాఫీస్ కింగ్‌గా అవతరించింది. అఆ, బిచ్చగాడు సినిమాలకు కూడా కలెక్షన్లు పెరిగినా.. నాని సినిమా పరిస్థితి అన్నిటికంటే మెరుగ్గా కనిపించింది. అమెరికాలో సైతం కలెక్షన్లు పుంజుకున్నాయి. అక్కడి బయ్యర్ తెలివిగా టికెట్ రేట్లు తగ్గించడం కూడా సినిమాకు కలిసొచ్చింది. జులై 15న కబాలి వచ్చే వరకు బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలేవీ పోటీలో లేని నేపథ్యంలో ‘జెంటిల్‌మన్’ ఇంకో రెండు వారాల పాటు ఓ మోస్తరు కలెక్షన్లు సాధించే అవకాశముంది. మొత్తంగా ఈ సినిమా హిట్ కేటగిరీలోకి వచ్చేసేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు