వివాదాల బాబుకు వివాహమట..!

వివాదాల బాబుకు వివాహమట..!

వివాదం.. ఈ మాటకు ప్యాంట్ షర్ట్ వేస్తే అచ్చంగా శింబు లాగే ఉంటుంది మరి. ఒకటా రెండా.. కెరీర్ మొదలైనప్పట్నుంచీ శింబు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. పాతికేళ్లకే స్టార్ హీరో అయిన ఈ హీరో.. అదే ఏజ్ లో లవ్ ఎఫైర్లతోనూ కావాల్సినంత క్రేజ్ తెచ్చుకున్నాడు.

నయనతారతో ఈయన నడిపిన యవ్వారం ఎవర్ గ్రీన్. పదేళ్ల కిందే నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగాడు శింబు. అన్నీ బాగుంటే ఇప్పటికే ఆమెతో పెళ్లైపోయి.. ఇద్దరు బుల్లి శింబులను కూడా దించేసేవాడేమో..! కానీ టైమ్ అప్పుడు కలిసి రాలేదు. దాంతో ఇప్పటికీ బ్రహ్మచారిగానే మిగిలి పోయాడు శింబు.

నయనతో కటీఫ్ అయిన తర్వాత హన్సికతోనూ కొన్నాళ్ల పాటు ప్రేమాయణం నడిపాడు శింబు. వీళ్ల వ్యవహారం కూడా పెళ్ళి వరకు వచ్చి ఆగింది. మధ్యలో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితోనూ కొన్నాళ్లు లవ్ ఎఫైర్ నడిపాడు. ఇలా ఇండస్ట్రీలో కనిపించిన ప్రతీ అమ్మాయిని లవ్ యూ అంటూ వెంటబడ్డాడు ఈ మన్మథ. కానీ ఏ ముద్దుగుమ్మ కరుణించలేదు.. మనోడు ఇంటోడు కాలేదు.

ఇప్పటికి శింబుకు పెళ్లి సమయం ఆసన్నమైంది. ఇదేదో గాలి వార్త కాదు.. స్వయంగా శింబు తండ్రి టి రాజేందర్ చెప్పిన మాట. తిరుత్తణి సమీపంలో ఆయన ఓ గుడికి వచ్చి పూజలు చేయించారు. శింబు పెళ్ళి గురించి విలేఖరులు అడగ్గా.. త్వరలోనే అంటూ సమాధానమిచ్చాడు రాజేందర్. శింబు పెళ్లి వీలైనంత త్వరగా అయిపోతుందని ఆయన చెప్పారు. అయితే అది ప్రేమ పెళ్ళా.. పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు