జులై 22న బాహుబలి ప్రకంపనలే..

జులై 22న బాహుబలి ప్రకంపనలే..

‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై దాదాపు సంవత్సరం అవుతోంది. ఇప్పటికీ ఆ సినిమా ప్రకంపనలు ఆగట్లేదు. ఇప్పటికే పలు దేశాల్లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన బాహుబలి.. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అయిన చైనాలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా చైనాలో ఏ ఇండియన్ మూవీ రిలీజ్ కాని స్థాయిలో ఏకంగా 6 వేల థియేటర్లలో ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదల కాబోతోంది. ఇప్పటికే ‘బాహుబలి’ గురించి ప్రపంచ స్థాయిలో ఎంతో చర్చ జరగడం.. చైనాలో ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున చేసిన నేపథ్యంలో ‘బాహుబలి’కి మాంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. వంద కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు సాధిస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.

ఇంతకుముందు అమీర్ ఖాన్ సినిమా ‘పీకే’ చైనాలో దాదాపు 5 వేల థియేటర్లలో విడుదలై వంద కోట్ల దాకా వసూళ్లు సాధించింది. ఆ రికార్డును ‘బాహుబలి’ కొట్టేస్తుందని అంచనా వేస్తున్నారు. చైనాలో ‘పీకే’ వసూళ్లను ‘బాహుబలి’ దాటేయగలిగితే.. ఇండయాస్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డు కూడా ‘బాహుబలి’ ఖాతాలో చేరడానికి అవకాశముంటుంది. ఇప్పటికే ఈ సినమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంకా కొన్ని విదేశాల్లో కలెక్షన్లను కలపాల్సి ఉంది. అవి, చైనా వసూళ్లు కలిపితే ‘పీకే’ పేరిట ఉన్న రూ.730 కోట్ల రికార్డును ‘బాహుబలి’ దాటేసినా ఆశ్చర్యమేమీ లేదు. ఇంతకీ చైనా ప్రేక్షకులు జక్కన్న విజువల్ వండర్‌ను ఎలా ఆదరిస్తారో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు