ప్రభాస్ త‌ల్లిగా ర‌మ్యకృష్ణ

ప్రభాస్ త‌ల్లిగా ర‌మ్యకృష్ణ

బాహుబలుడికి త‌ల్లి దొరికింది. ర‌మ్యకృష్ణ  ఆ పాత్రలో న‌టించ‌బోతోంది. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ చిత్రం `బాహుబ‌లి`. ప్రభాస్‌, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనుష్క క‌థానాయిక‌. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్‌, రానా త‌ల్లి పాత్రకోసం చాలా మందిని ప‌రిశీలించారు. చివ‌రికి ఆ పాత్రకోసం ర‌మ్యకృష్ణని ఓకే చేశారట‌. ఆమె రాజ‌మాత‌గా తెర‌పై క‌నిపించ‌బోతోంద‌ని చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జ‌రుగుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. నెల రోజుల‌పాటు అక్కడే చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English