అన్నా చెల్లెలు ఒకే దారిలో..!

అన్నా చెల్లెలు ఒకే దారిలో..!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సక్సెస్ కాకుండా కారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది నాగబాబు మాత్రమే. అన్నయ్య ఇమేజ్ ఉండి కూడా నాగబాబు హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఆ తర్వాత నిర్మాతగా, నటుడిగా బిజీ అయ్యాడు. ఇప్పుడు ఆయన వారసులు ఇద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక నిహారిక కూడా ఒక మనసు సినిమాతో వచ్చేసింది. ఈ ఇద్దరూ తమ తొలి సినిమా విషయంలో ఒకే దారిని ఫాలో అయ్యారు.

అన్నయ్య వరుణ్ తేజ్ ముకుందా లాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. ఈ సినిమా ఫ్లాపైనా.. ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం బాగానే నచ్చింది. పైగా వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక కంచె సినిమాతో తనలోని నటుడికి మరింత మెరుగుపెట్టాడు వరుణ్. కథల ఎంపికలో కూడా వరుణ్ ఛాయిస్ చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ తో తర్వాతి సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్.

ఇక ఇప్పుడు వరుణ్ చెల్లెలు నిహారిక కూడా అచ్చు అన్నయ్య దారిలోనే తొలి సినిమా చేసింది. ముకుందాలో కమర్షియల్ అంశాలు తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ఒక మనసులోనూ కమర్షియల్ కోణాలు ఎక్కడా కనిపించవు. హిట్ కావాలనుకుంటే కమర్షియల్ సినిమాతోనే వచ్చేది నిహా. కానీ నటిగా నిరూపించుకోవాలని అన్నయ్య దారిలోనే ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో వచ్చింది. ఒక మనసు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కానీ పొయెటిక్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం మనసుకు చేరువవుతుంది ఈ సినిమా. మొత్తానికి నాగబాబు వారసులిద్దరూ.. తమ దారి భిన్నం అని నిరూపించుకున్నారన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు