అందంతో చంపేస్తున్న రాక్ష‌సి

అందంతో చంపేస్తున్న రాక్ష‌సి

తొలి సినిమా ఫ్లాప్. కానీ ఆ ‘అందాల రాక్ష‌సి’ మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల క‌ల‌ల్లోకి వ‌చ్చి మ‌రీ క‌ల‌వ‌ర పెట్టింది. త‌న అందంతో కుర్రాళ్ల‌ను చావ‌గొట్టేసింది. వాళ్ల గుండెల మీద తిష్ట వేసుకుని కూర్చుంది. అవ్వ‌డానికి ఉత్త‌రాది అమ్మాయే కానీ.. ఆమెలో ఎటు చూసినా తెలుగందాలే క‌నిపిస్తాయి. బాపు బొమ్మ‌లోని ఫీచ‌ర్స్ అన్నీ పోత పోసిన‌ట్లుండే లావ‌ణ్యంతో ఆమె విసిరిన వ‌ల‌పు వ‌లలో చిక్కుకుని విల‌విల‌లాడుతున్న కుర్రాళ్లు కోకొల్ల‌లు.

పోయినేడాది ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌’లో మురిపించి.. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’లో చ‌క్కిలిగింత‌లు పెట్టిన లావ‌ణ్య త్రిపాఠి.. ఇప్పుడు ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’తో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతోంది. ఈ సినిమాలో కొన్ని స్టిల్స్ ఈ రోజు బ‌య‌టికి వ‌చ్చాయి. అందులో లావ‌ణ్య లావ‌ణ్యం చూస్తే కుర్రాళ్ల‌కు మ‌తిపోవ‌డం ఖాయం. అల్లు శిరీష్ కు ఎలాగూ హీరోగా ఓ ఇమేజ్ లేదు. అత‌డి ఖాతాలో విజ‌యాలూ లేవు. కాబట్టి ఈ సినిమాకు సేవింగ్ గ్రేస్ లావ‌ణ్య‌నే.

ఇటీవ‌లే కాశ్మీర్ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ జులైలో విడుద‌ల‌కు సిద్ధం కానుంది. ‘సోలో’ ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న  ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు