మాలీవుడ్ హీరోని ఫాలో అవుతున్న చైతు

మాలీవుడ్ హీరోని ఫాలో అవుతున్న చైతు

కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా భలే గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి గమ్మత్తైన అంశం ఒకటి.. అక్కినేని కుటుంబ కథానాయకుడు నాగచైతన్య విషయంలో జరుగుతోంది. అదేమిటంటే.. నివిన్ పాల్ నటించిన మలయాళ చిత్రం ప్రేమమ్ రీమేక్లో నటిస్తున్న చైతన్య.. విడుదలకు సిద్ధమైన తన తాజా చిత్రాలకి సంబంధించి హీరోయిన్ల విషయంలోనూ నివిన్ని తెలియకుండానే ఫాలో అవుతున్నాడు.

కాస్త వివరంలోకి వెళితే.. నివిన్కి రెండు నెలల గ్యాప్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన చిత్రాలు ఒరు వడక్కన్ సెల్ఫీ, ప్రేమమ్. ఈ రెండు చిత్రాలూ గతేడాదిలో విడుదలయ్యాయి. ఒరు వడక్కన్ సెల్ఫీలో మంజిమా మోహన్ హీరోయిన్గా నటించింది. ఆ తరువాత వచ్చిన ప్రేమమ్లో అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నటించారు.

కట్ చేస్తే.. నాగచైతన్య కొత్త చిత్రం సాహసం శ్వాసగా సాగిపోలో మంజిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. ఆ తరువాత నెల రోజుల గ్యాప్లో రానున్న మరో చిత్రం ప్రేమమ్లో అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి నివిన్కి కలిసొచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మలు చైతూకి కూడా కలిసొస్తారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English