నాని.. ఆరంభశూరత్వమే అవుతోంది నానా

నాని.. ఆరంభశూరత్వమే అవుతోంది నానా

‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో నాని జాతకమే మారిపోయింది. అతడి రెమ్యూనరేషన్ పెరిగింది. అతడి సినిమాల బడ్జెట్లు పెరిగాయి. మార్కెట్ పెరిగింది. తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ వచ్చింది. అంతా బాగుంది కానీ.. అతడి తర్వాతి సినిమాలు మంచి టాక్‌‌తో మొదలై.. మంచి ఓపెనింగ్స్ కూడా సాధిస్తున్నాయి కానీ.. ఆ తర్వాత ముందుకు కదలడానికి కష్టపడిపోతున్నాయి. ‘భలే భలే..’ తర్వాత నాని చేసిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కు విడుదలకు ముందే మంచి హైప్ వచ్చింది. సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సాయంత్రానికి టాక్ మరింత పాజిటివగ్‌గా మారింది. పరెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ఐతే వీకెండ్ అయ్యాక ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ జోరు తగ్గిపోయింది. కలెక్షన్లు ఉన్నట్లుండి డ్రాప్ అయిపోయాయి. ఇప్పుడు ‘జెంటిల్‌మన్’ విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరుగుతోంది. దీనికీ పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లూ బాగున్నాయి. అమెరికాలో వీకెండ్లోనే హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసిందీ సినిమా. కానీ వారాంతం ముగియగానే కలెక్షన్లు అన్ని చోట్లా డ్రాప్ అయ్యాయి. టాక్ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఇలా కలెక్షన్లలో మేజర్ డ్రాప్ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దీనికి ప్రధానంగా నానికి మాస్ ఫాలోయింగ్ లేకపోవడం.. అతడి సినిమాలు క్లాస్ ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లుగానే తెరకెక్కుతుండటం కారణాలుగా చెప్పొచ్చు. ‘భలే భలే మగాడివోయ్’ విషయంలో ఈ సమస్య లేకపోయింది. ఆ సినిమాతో బి, సి సెంటర్ల ప్రేక్షకులు కూడా బాగా కనెక్టయ్యారు. అన్ని చోట్లా మంచి కలెక్షన్లు వచ్చాయి. కాబట్టి నాని ఇకపై చేయబోయే సినిమాల్లో కొంచెం ఆ వర్గం ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో ఉంచుకుంటే బెటరేమో. అతడికి మాస్ సినిమాలు నప్పవు. అతడి నుంచి అలాంటి సినిమాలు ఆశించరు కూడా. కాకపోతే మాస్ ఆడియన్స్‌ను మెప్పించే కొన్ని అంశాలకు సినిమాలో చోటుండేలా చూసుకోవాలి. ప్రతిసారీ ఇలా ఆరంభ శూరత్వంతో సరిపెడితే కష్టం కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు