సునీల్ రుణం తీర్చుకుంటున్న చిరు

సునీల్ రుణం తీర్చుకుంటున్న చిరు

సామాన్య ప్రేక్షకుల్లో మాత్రమే కాదు.. ఇండస్ట్రీ జనాల్లోనూ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానులున్నారు. చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత కొంచెం స్తబ్ధుగా ఉన్న ఆ అభిమానులంతా.. ఈ మధ్య ఆయన సినిమాల్లోకి పునరాగమనం చేస్తుండటంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. మొన్న ‘మా టీవీ’ అవార్డుల వేడుకలో చిరంజీవి స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే ఆయన వెనుక డ్యాన్సర్ల బృందంలో కొందరు మెగా హీరోలతో పాటు శ్రీకాంత్, సునీల్ కూడా పాదం కదపడం గమనించే ఉంటారు. దీన్ని బట్టే వాళ్లిద్దరూ చిరుకి ఎంతటి వీరాభిమానులో అర్థం చేసుకోవచ్చు. ఈ అభిమానాన్ని చిరంజీవి బాగానే గుర్తుపెట్టుకున్నట్లున్నాడు.

తన కొత్త సినిమా ‘జక్కన్న’ ఆడియో వేడుకకు చిరంజీవిని ముఖ్య అతిథిగా సునీల్ పిలవగానే మరో మాట లేకుండా ఓకే చెప్పేశాడట చిరు. సునీల్ కూడా స్ట్రాటజిగ్గా చిరుతో కలిసి స్టెప్పులేశాడని దీన్ని బట్టి అర్థమవుతోంది. చిరు రీఎంట్రీ మూవీ ‘కత్తిలాంటోడు’ను డైరెక్ట్ చేయబోతున్న వి.వి.వినాయక్ కూడా ఈ వేడుకకు అతిథిగా రాబోతుండటం విశేషం. చిరు-వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఠాగూర్’ సునీల్ కీలక పాత్ర పోషించాడు. ఐతే ‘కత్తిలాంటోడు’లోనూ సునీల్ కు ఓ పాత్ర ఆఫర్ చేయగా.. అతను తిరస్కరించినట్లుగా వార్తలొచ్చాయి. ఆ సంగతలా వదిలేస్తే మొన్నటి టీజర్‌తో ‘జక్కన్న’ మీద జనాల్లో ఒక కరమైన నెగెటివ్ ఫీలింగ్ పడింది. సునీల్ మళ్లీ రొటీన్ మాస్ మసాలా సినిమానే ట్రై చేస్తున్నాడని అంతా పెదవి విరిచారు. ఇలాంటి టైంలో చిరు ముఖ్య అతిథిగా వచ్చి ఆడియో రిలీజ్ చేస్తే సినిమాకు హైప్ వస్తుందేమో చూడాలి. శుక్రవారమే ‘జక్కన్న’ ఆడియో విడుదల కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు