ఒక మనసు.. నాగబాబు చూడనన్నాడట

ఒక మనసు.. నాగబాబు చూడనన్నాడట

కూతురు హీరోయిన్‌గా పరిచయమవుతున్న సినిమా. ఆమె ఎలా నటించిందో.. తెరమీద ఎలా కనిపించిందో అన్న ఎగ్జైట్మెంట్‌ ఉండటం. .సామాన్య ప్రేక్షకుల కంటే ముందు ప్రివ్యూ చూసుకోవాలన్న కోరిక పుట్టడం సహజం. ఐతే నాగబాబు మాత్రం తన కూతురు నిహారిక ప్రధాన పాత్ర పోషించిన 'ఒక మనసు' ఇప్పుడే చూడాలని అనుకోలేదట. విడుదలకు ముందు రోజు చిరంజీవి సహా తన కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాడట ఆయన. ''నా నటన ఎలా ఉందో నాన్న చూడాలని కోరికగా ఉంది. షూటింగ్‌ జరుగుతున్న టైంలోనే రష్‌ చూస్తారా డాడీ అని ఆయన్ని అడిగాను కూడా. కానీ ఆయన చూడలేదు. లేదమ్మా.. ఫైనల్‌ ప్రాడెక్ట్‌ వచ్చాక అందరితో కలిసి చూస్తా అన్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్‌ నా తొలి సినిమా చూసి ఏమంటారో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా'' అని నిహారిక చెప్పింది.

'ఒక మనసు' కథ కూడా తన తండ్రి పూర్తిగా వినలేదని.. బేసిగ్గా ఆయనకసలు లవ్‌ స్టోరీలు నచ్చవని నిహారిక చెప్పింది. ''రామరాజు గారు ఈ కథను మూడున్నర గంటలు నెరేట్‌ చేసారు. డాడీ కథ వింటా అని కూర్చుని.. గంటన్నరే విని.. మిగతాది నువ్వే విని నిర?యం తీసుకో అని చెప్పి వెళ్లిపోయారు. నాకు సంధ్య పాత్ర బాగా నచ్చేసింది. ఇంకా చెప్పాలంటే రెండు రోజులు నాతోనే ట్రావెల్‌ చేసింది. అందుకే వెంటనే మరేం ఆలోచించకుండా ఓకె చేసేశాను'' అని నిహారిక చెప్పింది. తాను చేయకపోయినా.. సంధ్య పాత్ర ఇంతే పద్ధతిగా కనిపించేదని.. అంత ప్యూర్‌ గా ఈ పాత్రను రామరాజు మలిచారని నిహారిక చెప్పింది. నాగశౌర్యతో డేటింగ్‌ అంటూ వచ్చిన రూమర్లపై స్పందిస్తూ.. ''నేను సినిమాల్లోకి వస్తా అన్నపుడే ఇంట్లో అందరూ చెప్పారు.. కామెంట్లు, రూమర్లు వస్తాయి.. వాటికి ప్రిపేర్డ్‌గా ఉండమని.. అందుకే నేనేమీ పట్టించుకోలేదు'' అని నిహారిక చెప్పింది.