కాటన్‌ చీర...మల్లెపూవు...సముద్రం...

కాటన్‌ చీర...మల్లెపూవు...సముద్రం...

కాదేది కవితకనర్హం అనే మాట ఎంత నిజమో... సినీ దర్శకులకు... దైన్నైనా సినిమాటిక్‌ గా చూపిస్తారు. తమ మార్క్‌ ను చూపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.. కొందరు టాప్‌ డైరెక్టర్లు పండ్లు, పూలు.. మరి కొందరు సుమోలు ఇలా తమకంటూ ఓ గుర్తింపు ఉండేలా సినిమాల్లో చూపిస్తుంటారు. ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్‌ కూడా ఆ ట్రెండ్‌ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనే రామరాజు. ఒక మనసు చిత్ర దర్శకుడీయన. గతంలో ఈయన మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు రూపొందించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి నిహారికను హీరోయిన్‌ గా పరిచయంచేస్తూ ఒక మనసు రూపొందించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయన రెండు చిత్రాల్లోనూ కాటన్‌ చీర, మల్లె పూవు, సముద్రం కామన్‌ గా కనిపిస్తున్నాయి. దీని వెనక పెద్ద రహస్యమే దాగి ఉందని రామరాజు చెబుతున్నాడు.

సాధారణంగా.... మల్లె పూవు గురించి తెలియని వారుండరు. రొమాంటిక్‌ మూడ్‌ కి క్రియేట్‌ చేస్తుంది. అలాగే కాటన్‌ చీరలో ఎవరినైనా చూస్తే ఓ మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇక సముద్రం ప్రక తి ఇచ్చిన వరం. నా కథలు సహజంగా ఉంటాయి కాబట్టే బీచ్‌ ని కథలో భాగం చేస్తాను. నా కథలకు తగ్గట్టుగా ఈ మూడు కామన్‌ గా ఉంటాయి... అని రామరాజు చెబుతున్నాడు.

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన ఒక మనసు ఈనెల 24న గ్రాండ్‌ గా రిలీజ్‌ అవుతోంది. ఓవర్సీస్‌ లోనే దాదాపు 75 స్క్రీన్స్‌ లో రిలీజ్‌ చేస్తున్నారు. రెండు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి వస్తుందని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి... రామరాజు చెప్పిన ప్రేమ ఫిలాసఫీని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు