రోబో-2 కోసం అంత వెయిట్ చేయాలా?

రోబో-2 కోసం అంత వెయిట్ చేయాలా?

‘బాహుబలి: ది కంక్లూజన్’ 2016లో అని ‘బాహుబలి: ది బిగినింగ్’ ఎండ్ టైటిల్స్‌లో వేశాడు కానీ.. ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు జక్కన్న. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న కోసం ఇంకో 10 నెలలకు పైనే ఎదురు చూడాలి. ఇప్పటికే దాదాపు ఏడాది నుంచి ‘బాహుబలి-2’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు.. ఇంకో పది నెలలు అసహనాన్ని అణచుకుని వెయిట్ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న మరో ప్రెస్టీజియస్ మూవీ ‘రోబో-2’ కోసం కూడా ప్రేక్షకులు ఇంతే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యే రోబో-2 100 డేస్ షూటింగ్ అప్ డేట్ ఇస్తూ.. 50 శాతం సినిమా పూర్తయినట్లు వెల్లడించాడు శంకర్. 100 రోజుల్లోనే సగం అయిపోయిందంటే.. ఈ ఏడాది ఆఖర్లోనో.. వచ్చే ఏడాది ఆరంభంలోనో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందేమో అని ఆశించారు అభిమానులు. కానీ వచ్చే ఏడాది దసరా వరకు ఎదురు చూపులు తప్పవని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

షూటింగ్ పూర్తి చేయడం పెద్ద విషయమేమీ కాదని.. ఈ ఏడాదే టాకీ పార్ట్ అంతా పూర్తి కావచ్చని... ఐతే నిర్మాణాంతర కార్యక్రమాలకు చాలా సమయం పడుతుందని.. ఇప్పటికే ఆ పని మొదలైనప్పటికీ ఏడాదికి పైగా అందుకోసం శ్రమించాల్సి ఉంటుందని.. షూటింగ్ అయిపోయాక శంకర్ కనీసం పది నెలల పాటు టెక్నీషియన్స్‌తో కలిసి పని చేయబోతున్నాడని.. ఆ పనంతా అయ్యేసరికి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోకి వెళ్లిపోతామని.. అందుకే రోబో-2 టీం దసరాను టార్గెట్ చేసిందని అంటున్నారు. కాబట్టి ఇంకో 15 నెలలైనా రోబో-2 కోసం ఎదురు చూడాలన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English