ఇంద్రగంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్...

ఇంద్రగంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్...

అష్టాచమ్మా, అంతకు ముందు ఆ తర్వాత వంటి చిత్రాలతో తనకంటూ ఓ మార్క్ ఏర్పర్చుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. తాజాగా నాని హీరోగా జంటిల్ మన్ వంటి థ్రిల్లర్ తో హిట్టు కొట్టాడు. ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ డీసెంట్ చిత్రాలు తీయడానికే ఇష్టపడతాడు. అందుకే రేసులో ముందంజలో ఉండలేకపోతున్నానని ఓపెన్ గానే ఒప్పేసుకుంటున్నాడు. రెగ్యలర్ కమర్షియల్ చిత్రాలకు తాను దూరమంటున్నాడు. స్టార్స్ ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాలు తీయడం తనకు రాదని... అందుకే తాను పెద్ద స్టార్స్ తో సినిమాలు చేయలేదని... వాళ్లు కూడా తనని అప్రోచ్ కాలేదని నిర్మొహమాటంగా చెప్పాడు. భవిష్యత్తులో తాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.

కొడవటి గంటి కుటుంబరావు రాసిన నవలతో పాటు.... బుచ్చిబాబు రాసిన చివరకు మిగిలేది నవలల రైట్స్ ఇంద్రగంటి దగ్గరే ఉన్నాయి. త్వరలోనే కుటుంబరావు రాసిన నవలతో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఓ సినిమా తీయాలనుకుంటున్నాడు ఇంద్రగంటి. ఇప్పటికే స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడట. అయితే ఆ చిత్రానికి తగ్గ బడ్జెట్ పెట్టే నిర్మాత, ఆ కథకు తగ్గట్టుగా నటించే హీరో దొరికితే స్టార్ట్ చేస్తానంటున్నాడు. సోషల్ సైటైరిక్ గా ఈ చిత్రం ఉంటుందట. దీంతో పాటు... షేక్స్ పియర్ నాటకాల ఆధారంగా ఓ సినిమా చేయనున్నట్టు చెప్పాడు. జంటిల్ మన్ సక్సెస్ తర్వాత పెద్ద నిర్మాతల నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చిందని... ఎవరితో సినిమా చేస్తాననే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదంటున్నాడు. మొత్తమ్మీద ఓ ఇంటర్నేషనల్ సినిమాను చేసి.. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే చిత్రం చేయాలనేది ఇంద్రగంటి ఆశయంగా కనిపిస్తోంది.. ఆల్ ది బెస్ట్ టు ఇంద్రగంటి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు