రామ్ చరణ్ ఆమే కావాలంటున్నాడు

రామ్ చరణ్ ఆమే కావాలంటున్నాడు

కొందరు హీరోలకు.. కొందరు హీరోయిన్లకు కెమిస్ట్రీ బాగా వర్కవుటవుతుంది. అలాంటి కాంబినేషన్లు మంచి ఫలితాల్ని కూడా అందుకుంటాయి. రామ్ చరణ్‌కు అలా బాగా జోడీ కుదిరిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పటిదాకా చేసింది తొమ్మిది సినిమాలే అయినా అందులో మూడుసార్లు కాజల్‌తో జోడీ కట్టాడు చరణ్.

వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘మగధీర’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. తర్వాతి సినిమా ‘నాయక్’ సూపర్ హిట్టయింది. ‘గోవిందుడు అందరివాడేలే’ పర్వాలేదనిపించింది. కాజల్ అతిథి పాత్ర పోషించిన ‘ఎవడు’ కూడా బాగా ఆడింది. ఇప్పుడు మరోసారి చరణ్‌తో కాజల్ ఆడిపాడనున్నట్లు సమాచారం. ఐతే ఈసారి ఆమె చరణ్‌కు ఫుల్ టైం హీరోయిన్ కాదు.

చరణ్ కొత్త సినిమా ‘ధ్రువ’లో కాజల్ ఐటెం సాంగ్ చేయబోతోందట. ఇటీవలే సురేందర్ రెడ్డి ఆమెను సంప్రదించగా మరో మాట లేకుండా ఓకే చెప్పేసిందట కాజల్. ఆమె ఇప్పటిదాకా స్పెషల్ సాంగ్స్ చేసింది లేదు. ఐతే హీరోయిన్‌గా అవకాశాలు బాగా తగ్గిపోవడం.. పైగా ఇది చరణ్ సినిమా కావడంతో ఆమె ఈ ఆఫర్‌కు ఒప్పేసుకుందట. ‘ధ్రువ’ తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ ఏమీ ఉండవు.

ఐతే తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు చేసిన మార్పుల్లో భాగంగా ఐటెం సాంగ్ జోడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాశ్మీర్లో ‘ధ్రువ’ షూటింగ్ కొనసాగుతోంది. ఇంకో రెండు నెలల్లోనే సినిమా పూర్తయ్యేు అవకాశాలున్నాయి. సెప్టెంబరు 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు