నానికి చాలా పెద్ద కాంప్లిమెంటే ఇచ్చింది

 నానికి చాలా పెద్ద కాంప్లిమెంటే ఇచ్చిందినివేదా థామస్.. రెండు రోజులుగా టాలీవుడ్లో పెద్ద చర్చే నడుస్తోంది ఈ అమ్మాయి గురించి. ‘జెంటిల్‌మన్’ సినిమా చూసిన వాళ్లంతా నాని, ఇంద్రగంటి, మణిశర్మల తర్వాత ఎక్కువగా మాట్లాడుతోంది ఈ అమ్మాయి గురించే. క్రిటిక్స్ మాత్రమే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం ఈ అమ్మాయి భలే నటించిందే అంటున్నారు. తెలుుగు సినిమాల్లో ఓ హీరోయిన్ నటన గురించి ఇంత చర్చ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఈ మలయాళ అమ్మాయి ఆల్రెడీ తన మాతృభాషతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసి మంచి మార్కులు కొట్టేసింది. తమిళ దృశ్యం ‘పాపనాశం’లో కమల్ కూతురి పాత్ర పోషించింది నివేదానే. ‘జెంటిల్‌మన్’తో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మాయి.. తన హీరో నానికి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చింది. ‘జెంటిల్‌మన్’ సినిమా కోసం నానితో కలిసి పని చేస్తూ అతడి నటన చూసి ఆశ్చర్యపోయానని.. కమల్ హాసన్ తర్వాత అత్యంత నచ్చిన నటుడు నానియేనని ఆమె చెప్పింది.

‘‘నిజానికి నేను నానితో పని చేయడానికి ముందే అతడి పెద్ద ఫ్యాన్? నాని న‌టించిన దాదాపు అన్ని సినిమాలు చూశాను. పిల్ల జ‌మీందార్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను బాగా న‌టించాను అంటే ఆ క్రెడిట్ అంతా నానిదే. అతను అందగా నాకు సపోర్ట్ చేశాడు. ఒక హీరో త‌న తోటి ఆర్టిస్టుల అప్రిషియేట్ చేయ‌డానికి మంచి మనసుండాలి. నాని తన సహ నటీనటుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉత్సాహం నింపుతాడు. క‌మ‌ల్ హాస‌న్ గారి త‌ర్వాత నేను అత్యంత అభిమానించే హీరో నానీనే’’ అని నివేదా అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు