రూ.వంద లంచానికి మూడేళ్లు జైలుశిక్ష వేశారు

రూ.వంద లంచానికి మూడేళ్లు జైలుశిక్ష వేశారు

వందంటే వంద రూపాయిల లంచం అడిగిన నేరానికి తమిళనాడు చెందిన ఒక డిప్యూటీ తాహసిల్దార్ భారీ శిక్షకు గురయ్యారు. తన దగ్గరకు వచ్చి కులధ్రువీకరణ పత్రాన్ని అడిగినవారిని లంచం అడుగుతూ దొరికిపోయిన మహిళా అధికారికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేయటం సంచలనంగా మారింది.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం తాలూకాలోని ప్రభుత్వ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ గా జయలక్ష్మీ పని చేస్తోంది. 2006 ఆగస్టు 24న అదే ప్రాంతానికి చెందిన సురేశ్ తన కొడుకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ అప్లికేషన్ పెట్టుకున్నాడు. కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే వంద రూపాయిలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒళ్లు మండిన సురేశ్.. ఈ అవినీతి అధికారిణి గురించిన సమాచారాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందించారు.

వంద రూపాయిల లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయిన జయలక్ష్మిపై అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ తిరునల్వేలి ఏసీబీ కోర్టులో జరిగింది. కేసు విచారణ చేసిన కోర్టు శిక్షను ఖరారు చేస్తూ.. జయలక్ష్మిని రెండు నేర విభాగాల్లో ఏకకాలంలో మూడేళ్ల జైలుశిక్షను అనుభవించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. రూ.10వేల జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు. వంద రూపాయిల లంచం ఎంత భారీ శిక్షకు గురి చేసింది. ఈ లెక్కల వేలాది కోట్ల రూపాయిల అవినీతికి పాల్పడే వారికి మరెంత కఠిన శిక్షలు వేయాలో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు