సాయిధరమ్‌ లవ్ లైఫ్ ను చెడగొట్టేసిన మీనన్

సాయిధరమ్‌ లవ్ లైఫ్ ను చెడగొట్టేసిన మీనన్


సాయిధరమ్‌కు.. గౌతమ్ మీనన్‌తో కనెక్షన్ ఏంటి అంటారా..? అదే చిత్రం. తన లవ్ లైఫ్ మీద గౌతమ్ ఎఫెక్ట్ చాలా చాలా ఉందని.. ఆయన సినిమాల ఆధారంగానే తన లవ్ జర్నీలు సాగాయని అంటున్నాడు సాయిధరమ్. ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో వేడుక సందర్భంగా తన లవ్ స్టోరీల గురించి.. వాటి మీద గౌతమ్ మీనన్ సినిమాల ప్రభావం గురించి సాయిధరమ్ చెప్పిన తీరు హాట్ టాపిక్ అయింది. ఆడియో వేడుక మొత్తంలో హైలైట్ అంటే తేజ్ స్పీచే అని చెప్పాలి. ఈ స్పీచ్ సోషల్ మీడియాలో.. యూట్యూబ్‌లో ఇన్‌స్టంట్ హిట్టయిపోవడం.. దీని గురించి అందరూ చర్చించుకుంటుండటం విశేషం.

‘‘నా లవ్ లైఫ్ మీద గౌతమ్ మీనన్ గారి ఎఫెక్ట్ చాలా చాలా ఉంది. నేను టీనేజీలో ఉన్నపుడు ‘చెలి’ అనే సినిమా వచ్చింది. లవ్ చేస్తే అందులో మాధవన్ లాగా చేయాలనుకున్నాను. కానీ అలా చేయడం కుదర్లేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా చూశాను. అప్పటికి నేను ప్రేమించిన అమ్మాయి ఫారిన్లో ఉంది. వెళ్లి తనను ఇండియా తీసుకొచ్చేయాలని అనుకున్నా. తీరా అక్కడికి వెళ్తే ఆ అమ్మాయికి ఇంకొకడు ప్రపోజ్ చేసేశాడు. వాళ్లిద్దరూ ఒక్కటైపోయారు. ఆ తర్వాత నేను ‘ఏమాయ చేసావె’ సినిమా చూసి ఇన్ స్పైర్ అయ్యాను. కానీ ఆ టైంలో ప్రేమించిన అమ్మాయి వచ్చి.. నా కెరీర్ మీద దృష్టిపెట్టమని సూచించింది. తర్వాత ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చూశాక ప్రేమలో ఇన్ని తలనొప్పులు ఉంటాయా అనిపించి భయమేసింది. ఆ సినిమా తర్వాత ఇక ఇవన్నీ మానేసి కెరీర్ మీద దృష్టిపెడదామన్న నిర్ణయానికి వచ్చాను’’ అని సాయిధరమ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు