ఇలాంటి చమక్కులు ఆయనకే సొంతం

ఇలాంటి చమక్కులు ఆయనకే సొంతం

‘‘అన్నీ విప్పినపుడు ఏమీ అనిపించదు. కానీ సగం సగం విప్పినపుడే షైగా ఉంటుంది''.. మామూలుగా వింటే ఈ డైలాగ్ వల్గర్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ‘జెంటిల్‌మన్' సినిమాలో ఓ సన్నివేశంలో నాని నోట ఆ డైలాగ్ వింటుంటే మాత్రం ‘వల్గర్' ఫీలింగేమీ కలగదు. రొమాంటిగ్గా.. చాలా సరదాగా అనిపిస్తుందా డైలాగ్.

ఈ సన్నివేశం చూస్తుంటే ఇంద్రగంటి ఎంత రొమాంటికో.. ఎంత చక్కగా మాటలు రాస్తాడో అర్థమవుతుంది. సినిమాలో ఇలాంటి చమక్కులు చాలానే ఉన్నాయి. సినిమాలో ఎక్కడా లెంగ్తీ డైలాగులుండవు.. పంచ్ డైలాగులు అసలే ఉండవు.. ప్రాస కోసం ప్రయత్నాలుండవు.. అన్నీ కూడా షార్ట‌్‌గా ఉండే సింపుల్ డైలాగులే. సందర్భానికి తగ్గట్లుగా.. సింపుల్‌గా ఉంటూనే భలేగా అనిపిస్తాయి. మంచి ఫీలింగ్ కలిగిస్తాయి.

హీరో హీరోయిన్లు కోటీశ్వరులు. అయినప్పటికీ ఓ సందర్భంలో హీరోయిన్ ఆటోలో హీరో మీద కూర్చోవాల్సి వస్తుంది. ఆమె సందేహిస్తుంటే.. ‘‘బిజినెస్ క్లాస్‌లో కూడా ఇంత లగ్జరీ ఉండదు. వచ్చేయ్'' అంటాడు. మరో సన్నివేశంలో హీరో హీరోయిన్ని వీపు మీద ఎక్కించుకుని కొండెక్కడానికి రెడీ అవుతాడు. అప్పుడతను ‘‘మనకు డైటింగ్ లాంటి మూఢ నమ్మకాలేమీ లేవనుకుంటా'' అంటాడు. ఇలాంటి ఫన్నీ డైలాగులు సినిమాలో ఆద్యంతం అలరిస్తూ వెళ్తాయి. వెన్నెల కిషోర్‌ క్యారెక్టరైజేషన్.. అతడికి రాసిన డైలాగులైతే మామూలుగా పేలలేదు. ఇన్నాళ్లూ ఇంద్రగంటి సినిమాల్లో కామెడీ ఉండేది కానీ.. అది ఓ స్థాయికి మించి వినోదాన్ని పంచేది కాదు. కానీ ‘జెంటిల్ మన్'లో మాత్రం వెన్నెల కిషోర్ కామెడీ ఓ రేంజిలో పేలింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు