నాని రుణం తీర్చుకున్న గురువు..

నాని రుణం తీర్చుకున్న గురువు..

నాని జెంటిల్ మన్ సినిమాకు కమిట్ అయినపుడు చాలా మందిలో ఒకే అనుమానం ఉండేది.. ఈ సినిమాను నాని ఎందుకు ఒప్పుకున్నాడు..? కథ నచ్చిందని చెప్పినా.. తన గురువు కోసమే ఒప్పుకున్నాడని చాలామంది అనుకున్నారు. తనకు అష్టాచమ్మాతో లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటికి తాను లైఫ్ ఇవ్వడానికే జెంటిల్ మన్ సినిమా చేసాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం అందరికీ ఒకటే అనిపించింది. ఈ సినిమా టాలీవుడ్ లో నాని మినహా మరే హీరో చేయలేడని. అందుకే ఇంద్రగంటి ఏరికోరి మరీ నానినే తీసుకున్నాడని.

జెంటిల్ మన్ కు నానినే మేజర్ హైలైట్. అతడి భుజాలపైనే సినిమాను నడిపించాడు. కొత్త కథ కాకపోయినా.. కథనంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఇంద్రగంటి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా తగ్గకుండా నడిపించాడు ఈ దర్శకుడు. తన కెరీర్ లో ఇప్పటి వరకు సాఫ్ట్ జోనర్స్ మాత్రమే టచ్ చేసిన మోహనకృష్ణ.. జెంటిల్ మన్ తో థ్రిల్లర్ సబ్జెక్ట్ టచ్ చేసాడు.

థ్రిల్లర్స్ విషయంలో స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోతే అసలుకే మోసం వస్తుంది. కానీ ఇంద్రగంటి అలాంటి తప్పులు చేయలేదు. అక్కడక్కడా స్లో నెస్ కనిపించినా.. చివరికి పాస్ మార్కులతో బయటపడ్డాడు. మొత్తానికి నాని మొహమాటంతో జెంటిల్ మన్ చేసాడనుకున్నా.. కథ నచ్చి చేసాడని సినిమా విడుదలైన తర్వాతే అర్థమైంది. ఈ సినిమాతో వరసగా నాలుగో హిట్ నాని ఖాతాలో పడినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు